గారెనా ఫ్రీ ఫైర్, అత్యంత ప్రజాదరణ పొందిన బ్యాటిల్ రొయాల్ మొబైల్ గేమ్ Google Play, Apple యాప్ స్టోర్ నుండి అదృశ్యమైంది. 2020లో పబ్‌జీ మొబైల్ గేమ్ భారత్‌లో నిషేధానికి గురయ్యాక గరేనా ఫ్రీ ఫైర్ చాలా పాపులర్ అయింది. కోట్లాది మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రస్తుతం భారత్‌లో ఫ్రీ ఫైర్ అత్యంత పాపులర్ బ్యాటిల్ రొయాల్ గేమ్‌గా ఉంది. అంతేకాకుండా గారెనా ఇంటర్నేషనల్ లేదా ఆపిల్, గూగుల్ ఫ్రీ ఫైర్ స్టోర్ అదృశ్యానికి సంబంధించిన ప్రకటనను విడుదల చేయలేదు. Garena Free Fire మెరుగైన వెర్షన్ Free Fire Max ఇప్పటికీ Google Playలో అందుబాటులో ఉంది. కానీ Apple App Storeలో అందుబాటులో లేదు. ఇప్పటికే డౌన్‌లోడ్ చేయబడిన గేమ్ వెర్షన్ స్మార్ట్‌ఫోన్‌లలో పనిచేస్తుందో లేదో అస్పష్టంగా ఉంది.
గత నెల, క్రాఫ్టన్ (PUBG సృష్టికర్త) ఫ్రీ ఫైర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ గేమ్ నుండి ఫ్రీ ఫైర్ ఎలిమెంట్స్‌ని నేరుగా కాపీ చేసిందని ఆరోపించింది. ఒక ప్రత్యేక దావాలో, గేమ్‌ను వారి సంబంధిత యాప్ స్టోర్‌లలో అనుమతించినందుకు Google, Appleపై దావా వేసింది. తన ప్లాట్‌ఫారమ్‌లో గారెనా ఫ్రీ ఫైర్‌ను ప్రదర్శించడానికి స్ట్రీమర్‌లను అనుమతించినందున యూట్యూబ్ పాత్ర పోషించిందని క్రాఫ్టన్ ఆరోపించింది. PUBG Mobileలోని గేమ్ ప్లే, ఎయిర్ డ్రాప్ ఫీచర్, ఆయుధాలు, ప్రత్యేకమైన వస్తువుల డిజైన్, లొకేషన్లు గారెనా నేరుగా కాపీ చేసి ఫ్రీ ఫైర్, ఫీ ఫ్రైర్ మ్యాక్స్ (Free Fire Max) గేమ్‌లను రూపొందించిందని Krafton ఆరోపించింది.