అన్ని ఫీచర్లు ఉండేలా 'ఎక్స్' కు మార్పులు

ఇందులో ఏ ఫీచర్ లేదు అనడానికి లేకుండా ట్విట్టర్ లో సమూల మార్పులు చేస్తున్నాడు ఎలాన్ మస్క్.

By Medi Samrat  Published on  31 Aug 2023 9:45 PM IST
అన్ని ఫీచర్లు ఉండేలా ఎక్స్ కు మార్పులు

ఇందులో ఏ ఫీచర్ లేదు అనడానికి లేకుండా ట్విట్టర్ లో సమూల మార్పులు చేస్తున్నాడు ఎలాన్ మస్క్. ఇకపై ఫోన్‌ నంబర్‌ అవసరం లేకుండానే యూజర్లు కాల్స్‌ మాట్లాడుకునే సదుపాయాన్ని కల్పించనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. ఆ ఫీచర్ ను తీసుకుని వచ్చే డేట్ కు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. 'ట్విట్టర్' (ఎక్స్‌)ను కొనుగోలు చేసిన మస్క్‌ పలు మార్పులు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ట్విట్టర్ పేరును 'ఎక్స్'గా మార్చిన మస్క్ పిట్ట స్థానంలో ఎక్స్‌ లోగోను తీసుకుని వచ్చారు. వాట్సాప్ తరహాలో ఉచితంగా ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకునే సదుపాయాన్ని తీసుకొస్తున్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్‌ సహా వినియోగదారులందరికీ ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.

"X లో వీడియో, ఆడియో కాల్‌లు వస్తున్నాయి. iOS, Android, Mac, PCలో పని చేస్తుంది - ఫోన్ నంబర్ అవసరం లేదు - X అనేది ప్రభావవంతమైన గ్లోబల్ అడ్రస్ బుక్" అని ట్వీట్ చేశారు. ఇప్పటికే ట్విట్టర్ పేరును 'ఎక్స్'గా మార్చిన మస్క్.. పిట్ట స్థానంలో ఎక్స్‌ లోగోను ఉంచారు. ఇప్పుడు వాట్సాప్ తరహాలో ఉచితంగా ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకునే సదుపాయాన్ని తీసుకొస్తున్నారు.

Next Story