యాపిల్ ఫోన్.. కొన్ని సెకెండ్లలో హ్యాక్ చేశారుగా..!

Chinese hackers break into iPhone 13 Pro in 15 seconds. తమ ఫోన్ అంటే సెక్యూరిటీనే అని చెప్పుకునే యాపిల్ కు ఊహించని షాక్ తగిలింది. ముఖ్యంగా

By Medi Samrat  Published on  21 Oct 2021 1:24 PM GMT
యాపిల్ ఫోన్.. కొన్ని సెకెండ్లలో హ్యాక్ చేశారుగా..!

తమ ఫోన్ అంటే సెక్యూరిటీనే అని చెప్పుకునే యాపిల్ కు ఊహించని షాక్ తగిలింది. ముఖ్యంగా ప్రైవసీ విషయంలో తామే నెంబర్ వన్ అని చెప్పుకునే యాపిల్ ఫోన్స్ ను నిముషాల్లో కాదు.. సెకెండ్ల లో హ్యాక్ చేసేశారు. ఇది ఏ మాత్రం యాపిల్ సంస్థకు మింగుడు పడని అంశమే..! యాపిల్‌ విడుదల చేసిన 'ఐఫోన్‌ -13 ప్రో'ను సెకన్ల వ్యవధిలో 'వైట్‌ హ్యాట్‌' హ్యాకర్స్‌ హ్యాక్‌ చేశారని చైనాకు చెందిన టెక్‌ అనాలసిస్‌ సంస్థ 'ఐథోమ్' తెలిపింది.

ఆండ్రాయిడ్‌ ఫోన్‌లను ఎలా హ్యాక్‌ చేయొచ్చో.. యాపిల్‌ విడుదల చేసిన ఐఫోన్‌ 13సిరీస్‌ ఫోన్‌లను సెకన్లలో హ్యాక్‌ చేయొచ్చని చైనా 'వైట్‌ హ్యాట్‌' హ్యాకర్స్‌ తెలిపారు. చైనాలో 4వ 'టియాన్‌ఫు కప్' ఇంటర్నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ కాంటెస్ట్‌ జరిగింది. ఈ కాంటెస్ట్‌లో వైట్ హ్యాట్‌ హ్యాకర్‌ ఐఫోన్ 13 ప్రోని సెకన్‌లలో హ్యాక్‌ చేశాడు. హ్యాక్‌ చేసిన హ్యాకర్‌ ఐఫోన్‌లో ఉన్న ఫోటో ఆల్బమ్‌, యాప్‌లకు యాక్సెస్ చేశాడు. అంతేకాదు అందులో ఉన్న డేటాను సులువుగా డిలీట్‌ చేశారట. ఆపిల్ రిలీజ్ చేసిన ఐఫోన్ 13ప్రో సిరీస్ లో (iOS 15.0.2) సెక్యూరిటీని హ్యాక్ చేసి చూపించారు చైనా హ్యాకర్లు.


Next Story