చరిత్ర సృష్టించిన భారత్‌.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన విక్రమ్ ల్యాండర్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్రను సృష్టించింది.

By Medi Samrat  Published on  23 Aug 2023 6:15 PM IST
చరిత్ర సృష్టించిన భారత్‌.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన విక్రమ్ ల్యాండర్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్రను సృష్టించింది. జాబిల్లి ఉపరితలంపై విక్రమ్‌ ల్యాండమ్ విజయవంతంగా ల్యాండ్ అయింది. శాస్త్రవేత్తలు ఊహించినట్లుగా ల్యాండింగ్‌ ప్రక్రియ విజయవంతమైంది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. చంద్రయాన్‌-3 బుధవారం సాయంత్రం 6.03 గంటలకు ల్యాండర్‌ జాబిల్లిపై దిగ్విజయంగా కాలుమోపి, భారత వైజ్ఞానిక సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది.

రష్యాకు చెందిన లూనా-25 చంద్రుడి కక్ష్యలో ప్రవేశించే సమయంలో కూలిపోయింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌పై ఉత్కంఠంగా ఎదురుచూశారు. అయితే ఎలాంటి సమస్య లేకుండా భారత్ అద్భుతాన్ని ఆవిష్కరించింది.


Next Story