Chandrayaan-3: పైకి లేచిన విక్రమ్‌ ల్యాండర్‌.. మ‌రో చోట సాఫ్ట్‌ ల్యాండింగ్‌.. వీడియో

చంద్రయాన్‌ -3 మిషన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా విక్రమ్‌ ల్యాండర్‌ని మళ్లీ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేశారు.

By అంజి  Published on  4 Sep 2023 7:07 AM GMT
Chandrayaan-3 mission,Vikram lander,  Moon, ISRO

Chandrayaan-3: పైకి లేచిన విక్రమ్‌ ల్యాండర్‌.. మ‌రో చోట సాఫ్ట్‌ ల్యాండింగ్‌.. వీడియో

చంద్రయాన్‌ -3 మిషన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా విక్రమ్‌ ల్యాండర్‌ని మళ్లీ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేశారు. విక్రమ్ ల్యాండర్ మళ్లీ చంద్రుడిపై ల్యాండ్ అయిందని ఇండియన్ స్పేస్ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్ (ఇస్రో) సోమవారం వెల్లడించింది. భారత అంతరిక్ష సంస్థ ప్రకారం.. "విక్రమ్ ల్యాండర్ దాని మిషన్ లక్ష్యాలను పూర్తి చేసింది. ల్యాండర్‌ విజయవంతంగా పైకి లేచింది. కమాండ్‌ ఇచ్చిన తర్వాత విక్రమ్‌ ల్యాండర్‌ ఇంజిన్లు ఫైర్‌ అయ్యాయి. ఆ తర్వాత ఊహించిన విధంగా దాదాపు 40 సెం.మీ ఎత్తుకు పైకి లేచింది. 30 - 40 సెం.మీ దూరంలో సురక్షితంగా ల్యాండ్ అయింది". దీనికి సంబంధించిన విష‌యాన్ని ఇస్రో ఇవాళ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో తెలిపింది.

తాము ఇచ్చిన క‌మాండ్‌కు విక్ర‌మ్ స‌క్ర‌మంగా స్పందించిన‌ట్లు ఇస్రో చెప్పింది. ఆగ‌స్టు 23వ తేదీన తొలిసారి చంద్రుడి ద‌క్షిణ ధ్రువంపై విక్ర‌మ్ ల్యాండైంది. అయితే తాజాగా మిష‌న్ ల‌క్ష్యంలో భాగంగా ఆ ల్యాండ‌ర్‌ లేచేలా చేసి.. మ‌రో చోట దించారు. దీని కోసం నిర్వ‌హించిన హాప్ ఎక్స్‌ప‌రిమెంట్ సక్సెస్‌ అయిన‌ట్లు ఇస్రో తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇస్రో త‌న ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేసింది. ఇవాళ విక్ర‌మ్ ల్యాండ‌ర్‌త చేసిన ప్ర‌యోగం చాలా కీల‌క‌మైంద‌ని, భ‌విష్య‌త్తులో చేప‌ట్ట‌బోయే ప్ర‌యోగాల‌కు ఇది నాంది అవుతుందని వెల్ల‌డించింది. తర్వాతి ప్రయోగాల్లో చంద్రుడి నుంచి భూమ్మీద‌కు నమూనాలు తీసుకురావాల‌న్నా, లేక మాన‌వుల త‌ర‌లింపు ప్ర‌క్రియ చేప‌ట్టాల‌న్నా, ఇవాళ నిర్వ‌హించిన ప్ర‌యోగాం కీల‌క‌మైంద‌ని ఇస్రో వెల్లడించింది.

విక్ర‌మ్ ల్యాండ‌ర్‌కు చెందిన అన్ని సిస్ట‌మ్స్ నార్మ‌ల్‌, హెల్తీగా ప‌నిచేస్తున్న‌ట్లు ఇస్రో పేర్కొన్న‌ది. ఇదిలా ఉంటే.. గత వారం, విక్రమ్ ల్యాండర్ యొక్క టచ్‌డౌన్ స్పాట్ అయిన శివశక్తి పాయింట్ నుండి చంద్రుని ఉపరితలంపై 100 మీటర్లకు పైగా ప్రయాణించిన తరువాత, ప్రజ్ఞాన్ రోవర్ సురక్షితంగా పార్క్ చేయబడి స్లీప్ మోడ్‌లోకి సెట్ చేయబడిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శనివారం తెలిపింది.

Next Story