చంద్రయాన్-3 లో మరో ముందడుగు

చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో చంద్రయాన్‌‌–3 ప్రయోగాన్ని మొదలుపెట్టింది.

By Medi Samrat  Published on  14 Aug 2023 2:15 PM GMT
చంద్రయాన్-3 లో మరో ముందడుగు

చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో చంద్రయాన్‌‌–3 ప్రయోగాన్ని మొదలుపెట్టింది. జులై 14న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్–3 నెల రోజులు పూర్తి చేసుకుంది. మరో 10 రోజుల్లో చంద్రుడిపై అడుగుపెట్టనుంది. తాజాగా మరోసారి చంద్రయాన్–3 కక్ష్య తగ్గింపు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్ నుంచి ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపింది. చంద్రుడుకి, వ్యోమనౌకకు మధ్య దూరం మరింత తగ్గింది. తదుపరి కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఆగస్టు 16వ తేదీన ఉదయం 8.30కి చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది. ఆరోజు చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి చేరనుంది. తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ వేరుపడనుంది. ఆ తర్వాత ఈనెల 23న చంద్రుడిపై ల్యాండర్ దిగనుంది.

భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ త్వ‌ర‌లో సూర్యుడి అధ్య‌య‌నం కోసం ఆదిత్య ఎల్‌-1(Aditya L-1) మిష‌న్‌ను చేప‌ట్ట‌నున్న‌ది. ఆదిత్య ఎల్‌-1 మిష‌న్‌కు చెందిన ఫోటోల‌ను సోమ‌వారం ఇస్రో అప్‌డేట్ చేసింది. బెంగుళూరులో త‌యారైన ఆ శాటిలైట్ ఇప్పుడు శ్రీహ‌రికోటకు చేరుకుంది. సూర్యుడిని అధ్య‌య‌నం చేసేందుకు ఇస్రో సిద్ధమవుతూ ఉంది. సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో ఆదిత్య ఎల్‌-1ను ప్ర‌యోగించే అవ‌కాశాలు ఉన్నాయి.

Next Story