ఈ డివైజ్‌తో చెల్లింపులు మరింత సులభం

Axis Bank Launches Wear N Pay. ఒకప్పుడు ఏవైనా చెల్లింపులు జరపాలంటే బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది.

By Medi Samrat  Published on  13 March 2021 9:07 AM IST
ఈ డివైజ్‌తో చెల్లింపులు మరింత సులభం

ఒకప్పుడు ఏవైనా చెల్లింపులు జరపాలంటే బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో వివిధ రకాల చెల్లింపులు మరింత సులభతరం అయిపోతున్నాయి. ప్రస్తుతం ఇంట్లోనే ఉండి అన్ని ఆన్‌లైన్‌ సేవలు, డిజిటల్‌ చెల్లింపులు చేసుకునే సదుపాయాలు వచ్చేశాయి. సాంకేతికపరంగా అభివృద్ధి చెందుతున్నకొద్ది వ్యక్తులు పనులు చేసుకోవాలంటే మరింత సులభమైన పద్దతులు వచ్చేశాయి.

ఇప్పుడు తాజాగా మరో సులభమైన టెక్నాలజీ వచ్చేసింది. డిజిటల్‌ రూపేణా నగదు చెల్లింపులకు సంబంధించి కొత్త పద్దతులు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ అయిన యాక్సిస్‌ బ్యాంకు డిజిటల్‌ చెల్లింపుల కోసం సరి కొత్త డివైజ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో ఎటువంటి కార్డులు, వ్యాలెట్లు లేకున్నా సరే. కేవలం చేతికి ధరించే ఓ డివైజ్‌తో చెల్లింపులు చేసుకోవచ్చు.

ఈ సదుపాయాన్ని యాక్సిస్‌ బ్యాంకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ డివైజ్‌ను 'వియర్‌ అండ్‌ పే'గా పిలుస్తారు. దీనికి ముందుగా రూ.750 వార్షిక ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి యేటారూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే డివైజ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఏది ఏమైనా తమ డివైజ్‌తో చెల్లింపులు మరింత సులభంగా మారనున్నట్లు సంబంధిత సంస్థ చెబుతోంది.


Next Story