ఐఫోన్ 14 తాజా మోడల్‌ను భారత్ లో ఉత్పత్తి చేయనున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. చైనాలో ఉన్న ఉత్పత్తి కేంద్రాన్ని ఇండియాకు తరలిస్తున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటన చేసింది. భారత్ లో ఐఫోన్ 14ను ఉత్పత్తి చేయడానికి ఉత్సాహంగా ఉన్నామని కూడా ఆ సంస్థ తన ప్రకటనలో పేర్కొన్నది. ఈ ఏడాది చివర వరకు 5 శాతం ఐఫోన్ 14 తయారీ ఇండియాలో జరగనున్నట్లు జేపీ మోర్గన్ సంస్థ అంచనా వేస్తోంది. 2025 నాటికి నాలుగింటిలో ఒక ఐఫోన్ ఇండియాలోనే తయారవుతుందని జేపీ మోర్గన్ సంస్థ తెలిపింది.
ఐఫోన్ 14 విడుదలైన మూడు వారాలకే భారత్ లో ఐఫోన్ 14 ను తయారు చేయడం ప్రారంభించింది. ఐఫోన్ 14 ఆవిష్కరించిన మూడు వారాల లోపే ఆపిల్ సోమవారం ఈ ప్రకటన చేసింది. భారతదేశంలో తయారీని వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తోంది. చైనాలో చాలా కాలంగా తన ఐఫోన్‌లను తయారు చేసిన ఆపిల్, జి జిన్‌పింగ్ పరిపాలన US ప్రభుత్వంతో విబేధాలు ఉండడంతో.. ప్రత్యామ్నాయాలను వెతుకుతోంది. అందులో భాగంగా భారత్ ను ఎందుకుంది యాపిల్ సంస్థ.