ఇటీవలి కాలంలో గ్రహాంతర వాసులకు సంబంధించిన చర్చ బాగా జరుగుతోంది. కొందరు ప్రముఖులు కూడా ఏలియన్స్ విషయంలో చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అమెరికా ఏలియన్స్ తో కలిసి పని చేస్తూ ఉందని.. ట్రంప్ కూడా ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పడానికి తహతహలాడుతూ ఉన్నాడని కథనాలు వచ్చాయి. ఈ విశ్వంలో మనం ఒంటరి కాదని నమ్మే వాళ్లు చాలామందే ఉన్నారు.
శాస్త్రవేత్తలు చాలాకాలంగా గ్రహాంతరవాసులకు సంబంధించి పరిశోధనలు సాగిస్తున్నారు. అత్యంత శక్తిమంతమైన టెలిస్కోపులు, రేడియో ఫ్రీక్వెన్సీ వ్యవస్థలు వినిగియోస్తున్నారు. నెదర్లాండ్స్ లోని పరిశోధకులు టౌ బౌట్ అనే నక్షత్ర మండలం నుంచి కొన్ని ఉద్గార విస్ఫోటనాలను కనుగొన్నారు. ఈ సంకేతాలు రోదసిలో సౌరవ్యవస్థకు 51 కాంతి సంవత్సరాల దూరం నుంచి వస్తున్నట్టు రేడియో టెలిస్కోప్ సాయంతో గుర్తించారు. ఈ విధమైన రేడియో మాగ్నెటిక్ సంకేతాలు రోదసి నుంచి రావడం ఇదే ప్రథమం. ఆ సంకేతాలు బహుశా భూమి వంటి ఓ గ్రహం నుంచి వస్తున్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తూ ఉన్నారు. దీనిపై మరింత లోతుగా పరిశోధనలు చేయడానికి నెదర్లాండ్స్ సైంటిస్టులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ ఉన్నారు.