స్కూల్స్ ఓపెన్ అయ్యాయి.. పిల్లలను ఎలా కూర్చో పెడుతున్నారంటే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 April 2020 3:07 AM GMT
స్కూల్స్ ఓపెన్ అయ్యాయి.. పిల్లలను ఎలా కూర్చో పెడుతున్నారంటే..!

టైటిల్ ను చూసి ఒక్క సారిగా షాక్ తినకండి.. స్కూల్స్ ఓపెన్ అయ్యింది మన దేశంలో కాదు లెండి.. చైనాలో..! ప్రపంచం మొత్తం షట్ డౌన్ లో ఉన్నప్పటికీ చైనాలో మాత్రం కార్యకలాపాలు మొదలయ్యాయి. పిల్లలు పాఠశాలలకు కూడా వెళుతున్నారు. చైనా లోని వుహాన్ లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రపంచ దేశాలు లాక్ డౌన్, షట్ డౌన్ లు అమలు చేస్తున్నాయి. దీంతో పిల్లలు ఇళ్లకే పరిమితమయ్యారు.

కానీ చైనాలో పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. చైనాలో స్కూల్స్ ఒక్కొక్కటిగా తెరచుకుంటూ ఉన్నాయి. ఇక స్కూళ్లలో విద్యార్థుల మధ్య సామాజిక దూరం ఉండాలనే నిబంధనలను పెట్టారు. వైరస్ వ్యాప్తి జరగకుండా ఉండాలంటే సామాజికంగా దూరం పాటించాలని.. అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని పాఠశాలల యాజమాన్యానికి నిబంధనలు పెట్టింది. చైనా లోని హంగ్ఝు నగరంలో సామాజిక దూరం పాటించే విషయమై ఆసక్తికర ఏర్పాట్లు చేశారు.

పిల్లల తల మీద మూడు అడుగుల పొడవు ఉండే చిన్నపాటి గొట్టం లాంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఇరువైపులా కనీస దూరం పాటించేలా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు మీడియాలో ప్రచారం చేశారు కూడా..! తలపై టోపీలను పెట్టి.. ఆ టోపీలపై కార్డు బోర్డు లేదా బెలూన్ లతో మూడడుగులు పొడవు ఉండేలా తయారు చేశారు. అలా చేస్తే అవి ఒకరికి.. ఇంకొకరికి తగిలి సామాజిక దూరం పాటిస్తారని వాళ్ళ ఐడియా. పిల్లలను కూడా పక్కపక్కనే కూర్చోపెట్టకుండా.. ఒక్కొక్కరిని ఒక్కో వరుసలో కూర్చోపెట్టారు.

ఈ విధానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా మంచి స్పందన వస్తోంది. డ్యూక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఐలీన్ చెంజియన్ చౌ ఈ ఫోటోలను షేర్ చేస్తూ మరో ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. సాంగ్ రాజవంశం చైనాను పాలిస్తున్న సమయంలో ఇటువంటి వాటిని ఉపయోగించారని.. అప్పట్లోనే సామాజిక దూరం అన్నది అమలులో ఉందని చెప్పుకొచ్చారు. ఆమె ట్వీట్ ను 16వేల మందికి పైగా లైక్ చేశారు. కొన్ని వేల రీట్వీట్లు వచ్చాయి.

ప్రపంచం మొత్తం కరోనాను కట్టడి చేయలేక తలలు పట్టుకుంటూ ఉంటే.. చైనా మాత్రం చిన్న పిల్లల తలలపై చిన్న చిన్న ఏర్పాట్లు చేసి.. పాఠశాలలకు పంపించేస్తోంది.



Next Story