రేపటి నుండి స్కూళ్లు ప్రారంభం : మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Sep 2020 4:40 AM GMTఅన్‌లాక్ 4.0లో భాగంగా ఈ నెల 21 నుంచి 9 - 12 తరగతుల వరకు క్లాసుల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారమే నడుచుకోవాలని స్పష్టంచేసింది. మార్గదర్శకాల్లో ప్రధానంగా 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఇష్టమైతేనే బడికి వెళ్లే వెసులుబాటు కల్పించింది. లేదంటే ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ క్లాసులు వినే ఆప్షన్ ఇచ్చింది. ఈ మేరకు తల్లిదండ్రులు/సంరక్షకుల నుంచి రాతపూర్వక లేఖను విద్యార్థులు సమర్పించాలని సూచించింది.
1. నేపథ్యం:
కోవిడ్-19 నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ నుంచి కేంద్ర ప్రభుత్వం దశలవారీగా అన్ లాక్ పేరుతో అనుమతులు ఇస్తూ వస్తోంది. అన్ లాక్ 4.0లో భాగంగా ఈ నెల 21 నుంచి 9 నుంచి 12 తరగతుల వరకు క్లాసుల నిర్వహణకు అనుమతులు ఇచ్చింది.
2. పరిధి:
సెప్టెంబర్ 21వ తేదీ నుంచి 9 నుంచి 12 వ తరగతి వరకు పాఠశాలలను సురక్షితంగా తిరిగి ప్రారంభించడం కోసం ఈ మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. ఇక్కడ సూచించిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాటిస్తూ కోవిడ్ 19 వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
3. సాధారణ నివారణ చర్యలు:
కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడానికి సాధారణ ప్రజలు తీసుకునే ప్రజారోగ్య చర్యలన్నింటినీ ఇక్కడ కూడా అందరూ (అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు మరియు సందర్శకులు) పాటించాలి.
• సాధ్యమైనంత వరకు బహిరంగ ప్రదేశాల్లో కనీసం 6 అడుగుల దూరం పాటించాలి
• ఫేస్ కవర్లు / మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలి.
• సబ్బుతో (కనీసం 40-60 సెకన్ల పాటు) తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. మీ చేతులు మురికిగా కనిపించకపోయినా శుభ్రం చేసుకోండి. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ (కనీసం 20 కి
సెకన్లు) శుభ్రం చేసుకోవాలి.
• దగ్గు, తమ్ములు వచ్చినపుడు తప్పనిసరిగా మోచేతలను అడ్డుపెట్టుకోవడం లేదా కర్చీఫ్, టిష్యూ పేపర్ ఉపయోగించాలి. టిష్యూ పేపర్ ను పారవేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
• ఆరోగ్యపరిస్థితులను ఎప్పటికప్పుడూ గమనిస్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా అనారోగ్యకర లక్షణాలు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి
• పాఠశాలల పరిసరాల్లో, డస్ట్ బిన్లలో, వాష్ రూమ్ లలో ఉమ్మివేయడం నిషేధించబడింది.
• ప్రతి ఒక్కరూ ఆరోగ్యసేతు యాప్ ఇనిస్టాల్ చేయడంతోపాటు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలి.
4. అన్ని పాఠశాలు (9 నుంచి 12వరకు) ఈ కింది ఇవ్వబడిన ఏర్పాట్లు చేయాలి.
• ఆన్లైన్ / దూరవిద్యలకు అనుమతించడం జరిగింది. దాన్నే కొనసాగించాలని ప్రోత్సహించండి.
• 9 నుంచి 12వ క్లాసు విద్యార్థులు వారంతట వారే టీచర్ల నుంచి సలహాలు, సందేహాలు తీర్చుకోవడానికి రావచ్చు. ఇది ఆయా విద్యార్థుల తల్లింద్రుల అనుమతి ఉండాలి. అలా వచ్చిన విద్యార్థులతో టీచర్లు తగిన దూరం పాటిస్తూ వారితో మాట్లాడాలి.
4.1 పాఠశాలలు ప్రారంభించడానికి ముందు:
a) పాఠశాలలను తిరిగి తెరవడానికి:
• కంటైన్మెంట్ జోన్లకు బయట ఉంటేనే అనుమతించడం పాఠశాలలు, కాలేజీలు ప్రారంభించడానికి అనుమతి ఇవ్వాలి. కంటైన్మెంట్ జోన్లలో నుంచి వచ్చే విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బందిని పాఠశాలలకు అనుమతించకూడదు. కంటైన్మెంట్ జోన్లలో ఉండే పాఠశాలలకు విద్యార్థులు, స్టాఫ్ కూడా వెళ్లకూడదు.
• విద్యా సంస్థలు తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ముందుగానే హాస్టల్లు, ల్యాబొరేటరీలు మరియు అందరూ కలిసి ఉపయోగించే సాధారణ స్థలాలు, అక్కడ తరచూ తాకే వస్తువులు, ప్రాంతాలను 1% సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రపరచాలి.
• పాఠశాలలను క్వారంటైన్ కేంద్రాలుగా ఉపయోగించి ఉన్నట్టయితే వాటిని తగినవిధంగా శుభ్రం చేయాలి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఇదివరకు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలి.
• పాఠశాలలకు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ (50శాతం వరకు) మాత్రమే వచ్చేలా చూసుకోవాలి. అది కూడా విద్యార్థులకు అవసరమైన ఆన్ లైన్ టీచింగ్, టెలీ కౌన్సిలింగ్ కు సంబంధించిన పనుల కోసం రప్పించాలి.
• 9 నుంచి 12 తరగతి వరకు విద్యార్థులు ఆన్ లైన్, వర్చువల్ క్లాసులకు సంబంధించిన సందేహాల కోసం పాఠశాలలకు రావచ్చు. ఇది కేవలం విద్యార్థులకు సంబంధించిన వ్యక్తిగత శ్రద్ధమీద ఆధారపడి ఉంటుంది. అందుకు వారి తల్లిదండ్రులు కూడా రాతపూర్వకంగా తెలియజేయాలి.
• బయో మెట్రిక్ హాజరు పద్దతి అవసరం లేదు. వీలైనంత వరకు కాంటాక్ట్ లెస్ ప్రత్యామ్నాయ పద్దతుల ద్వారా సిబ్బంది హాజరును గుర్తించే ఏర్పాట్లు చేసుకోవాలి.
• ప్రాంగణం లోపల మరియు వెలుపల 6 అడుగుల దూరంతో నిర్ధిష్టమైన గుర్తులను వేయాలి. అందుకు తగిన విధంగా సీటింగ్, ఇతర కార్యకలాపాలు ఉండేలా చూసుకోవాలి.
• చేతులను శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్ తోపాటు సబ్బులను కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి.
• పాఠశాల ఆవరణలో, బయట ప్రదేశాల్లో ఆరడుగుల దూరం ఉండేలా మార్కింగ్ చేయాలి. అదే విధంగా స్టాఫ్ రూములలో, రిసెప్షన్లలో, మెస్, లైబ్రెరీ లాంటి ప్రదేశాల్లో కూడా భౌతికదూరం పాటించాలి.
• ఆటలు మరియు ఇతర కార్యకలాలపాలు నిర్వహించేటప్పుడు ఎక్కువమంది ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
• అత్యవసరమైతే టీచర్లు, విద్యార్థులు ఇతర సిబ్బంది సంప్రదించడానికి వీలుగా రాష్ట్ర హెల్ప్‌లైన్ నంబర్లను మరియు స్థానిక ఆరోగ్య అధికారుల నంబర్లను అక్కడ ప్రదర్శించాలి.
• ఎయిర్ కండిషనింగ్ పరికరాల ఉష్ణోగ్రత 24-30 డిగ్రీలు, తేమశాతం 40-70% పరిధిలో ఉండాలి. స్వచ్ఛమైన గాలి తీసుకోవడం కోసం అవసరమైన వెంటిలేషన్ సదుపాయాలు ఉండాలి.
• విద్యార్థుల లాకర్లను భౌతిక దూరం పాటిస్తూ, ఎప్పటికప్పుడు క్రిమిసంహారకం చేస్తూ వినియోగించాలి.
• వ్యాయామశాలలు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ మార్గదర్శకాల (MoHFW) మార్గదర్శకాలను అనుసరించి ప్రారంభించవచ్చు. (https://www.mohfw.gov.in/pdf/Guidelinesonyogainstitutesandgymnasiums03082020.pdf
• స్విమ్మింగ్ పూల్స్ (వర్తించే చోట) మూసివేయాలి.
అందుబాటులో ఉంచాల్సినవి:
* పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లు, ఫేస్కవర్లు, మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లను పెద్దఎత్తున నిల్వ ఉంచుకోవాలి.
* థర్మల్‌గన్స్, ఆల్కహాల్‌వైపర్లు, సబ్బులు, పల్స్ ఆక్సీమీటర్లు, ఐఈసీలను సైతం అంబాటులో ఉంచుకోవాలి.
* వాడిన పీపీఈ కిట్లు, చెత్తను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారం తరలించాలి.
* వ్యర్థాల సేకరణ, నిర్వహణపై పారిశుధ్య కార్మికులకు (హౌస్‌కీపింగ్) శిక్షణనివ్వ
4.2 స్కూళ్లు తెరిచిన తర్వాత:
a) ప్రవేశ మార్గం దగ్గర:
• ప్రతి ప్రవేశమార్గంలో తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకొనేందుకు శానిటైజర్ తోపాటు థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలి. వీలైతే లోపలికి వెళ్లడానికి ఒకమార్గం, బయటకు రావడానికి మరో మార్గం ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
• సాధారణ టెంపరేచర్, ఎలాంటి లక్షణాలు కనిపించని ఉద్యోగులు/ విద్యార్థులు/ ఇతర సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతించాలి. ఒకవేళ ఎవరైనా లక్షణాలున్నట్టు గుర్తిస్తే దగ్గర్లోని హెల్త్ సెంటర్ ను రెఫర్ చేయాలి.
• పోస్టర్లు/ స్టాండీస్ ను కోవిడ్-19 రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తప్పకుండా ప్రదర్శించాలి.
• పార్కింగ్ ప్రదేశాలు, లిఫ్టుల దగ్గర రద్దీగా ఉండకుండా భౌతికదూరం పాటిస్తూ వెళ్లేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
• రోజువారీగా వచ్చే సందర్శకులను నియంత్రించాలి. తాత్కాలికంగా విజిటర్స్ ను నిలిపివేయాలి.
b) క్లాసు రూమ్ లో బోధించే సమయంలో:
• క్లాసు రూమ్ లో కూర్చునే చోట కుర్చీలు, డెస్కుల మధ్య 6 అడుగుల దూరం ఉండేలా చూడాలి.
• క్లాసు రూమ్స్ లో బోధన సమయాలు కూడా వేర్వేరుగా ఉండాలి. వీలైనంత మేరకు క్లాస్ రూములను క్రిమిసంహారం చేయడంతోపాటు విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చూడాలి.
• క్లాసులు జరుగుతున్నంతసేపు విద్యా్ర్థులు, అధ్యాపకులు తప్పనిసరిగా మాస్కును ధరించే ఉండాలి.
• ల్యాప్ టాప్స్, నోట్ బుక్స్, పెన్సిల్స్, పెన్నులు, వాటర్ బాటిళ్లు తదితర వస్తువులను ఇతరులతో పంచుకోకుండా చూడాలి.
c) వర్క్ షాపులు/ ల్యాబొరేటరీల్లో శిక్షణ ఇవ్వడానికి:
• వర్క్ షాపులు/ ల్యాబొరేటరీల్లో తరచూ ఉపయోగించే, తాకే పరికరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి
• పరికరాలు / వర్క్ స్టేషన్లో పనిచేయడానికి ఒక వ్యక్తికి 4 మీటర్ల చొప్పున నేల విస్తీర్ణం ఉండేలా చూసుకోవాలి.
• ప్రాక్టికల్ సామగ్రిని ఉపయోగించే ముందు మరియు తరువాత తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇందుకోసం వర్కస్టేషన్లు/ సిములేషన్ ల్యాబ్స్ లో హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.
d) లైబ్రరీ, క్యాంటీన్, వ్యాయామశాలలు, ఇతర సాధారణ ప్రదేశాల్లో:
• భౌతిక దూరం కనీసం 6 అడుగులు ఉండేలా చూసుకోవాలి
• లైబ్రరీ, క్యాంటీన్, వ్యాయామశాలలు, ఇతర సాధారణ ప్రదేశాల్లో ఉన్నపుడు తప్పకుండా మాస్కును ధరించాలి
• క్యాంటీన్లు మూసివేసి ఉండాలి
• సాధ్యమైనంత వరకు నగదు చెల్లింపులకు బదులు ఆన్ లైన్ చెల్లింపులు చేయాలి.
e) రవాణా సదుపాయాలు:
• స్కూల్ రవాణా సదుపాయాలు కల్పిస్తున్నట్టయితే ప్రతిరోజూ బస్సులు, ఇతర రవాణా సాధనాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయడంతోపాటు భౌతిక దూరం పాటించేలా చూడాలి.
5) పరిశుభ్రత మరియు శానిటేషన్:
• ప్రతిరోజూ అన్ని ప్లోర్లను తప్పనిసరిగా శుభ్రం చేయించాలి.
• టాయిలెట్లు ఇతర కామన్ ప్రదేశాల్లోనూ తగినంత స్థాయిలో సబ్బు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి.
• తరచూ తాకే ప్రదేశాలయిన (డోర్ నాబ్స్, లిఫ్టు బటన్స్, కుర్చీలు, బెంచీలు, వాష్ రూమ్ ఫిక్సెర్స్) తదిరాలను 1శాతం సోడియం హైపోక్లైట్ ద్రావణంతో కలిసి తరచూ క్రిమీసంహారం చేయాలి. అంతేకాకుండా క్లాసు రూములు, ల్యాబొరేటరీలు, లాకర్లు, పార్కింగ్ ప్రదేశాలు ఇతర సాధారణ ప్రదేశాల్లో క్లాసులు ప్రారంభించడానికి ముందు, అయిపోయాక క్రిమీసంహారకం చేయాలి.
• టీచింగ్ మెటీరియల్స్, కంప్యూటర్లు, ల్యాప్ టాప్స్, ప్రింటర్లను 70శాతం ఆల్కాహాల్ ద్రావణంతో క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.
• వాష్ రూమ్స్, మరుగుదొడ్లు, వాషింగ్ స్టేషన్లను కూడా ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి.
• ఉపయోగించిన మాస్కులు, చేతి కవర్లను వేర్వేరు డబ్బాల్లో పారవేయాలని విద్యార్థులు, సిబ్బందికి సూచించాలి. తరగతి గదులు, ఇతర ప్రదేశాల్లోనూ డస్ట్ బిన్లు అందుబాటులో ఉంచాలి. అందులో పారవేసిన మాస్కులను మూడు రోజుల తర్వాత సాధారణ వ్యర్థపదార్థాలతో కలిపి పారవేయాలి
• నివాస భవనాలు ఏవైనా ఉంటే వాటిని కూడా క్రమం తప్పకుండా శానిటైజ్ చేయాలి.
6. రిస్క్ కమ్యునికేషన్:
• స్కూల్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు, ఖాళీ సమయాల్లో గుంపులుగా ఉండడం వంటి చేయకుండా అవగాహన కల్పించాలి.
• అంతేకాకుండా సాధారణ రక్షణ చర్యలయిన తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, శ్వాస సంబంధిత జాగ్రత్తలు, భౌతిక దూరం, మాస్కు ధరించడంపైనా అవగాహన కల్పించాలి.
• ఆందోళన మరియు మానసిక ఒత్తిడికి గురవుతున్న వారికి రెగ్యులర్ కౌన్సిలింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలి.
• ఒకవేళ విద్యార్థి లేదా అధ్యాపకులు అనారోగ్యానికి గురైతే వారు ఇనిస్టిట్యూట్ కి రాకుండా అవసరమైన ప్రొటోకాల్స్ పాటిస్తూ ఇంట్లోనే ఉండాలి.
7. మానసికంగా, సామాజికపరంగా మంచిగా ఉండడం:
• విద్యార్థులుగానీ, ఉపాధ్యాయులు గానీ ఆందోళన, నిరాశకు గురైనట్టుగానీ, మానసిక ఆరోగ్య పరమైన సమస్యలను తెలిపేవారి కోసం రెగ్యులర్ గా కౌన్సెలింగ్ ఉండేలా చూడాలి.
• ఉపాధ్యాయులు, పాఠశాలలోని అడ్వైజర్లు, హెల్త్ వర్కర్లు అందరూ విద్యార్థుల భద్రత నేపథ్యంలో కలిసికట్టుగా పనిచేయాలి.
8. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందిలో కోవిడ్ లక్షణాలు కనిపించినట్టయితే:
• కోవిడ్ లక్షణాలు కనిపించిన వారిని వెంటనే ప్రత్యేక గదిలో ఉంచాలి.
• అవసరమైతే వారి తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు తెలియజేయాలి
• డాక్టర్ వచ్చి పరీక్షించే వరకు మాస్కు లేదా ఫేస్ కవర్ ధరించి ఐసోలేషన్ లోనే ఉండాలి.
• వెంటనే దగ్గరల్లో ఉన్న ఆస్పత్రి లేదా క్లినిక్ గానీ, రాష్ట్ర లేదా జిల్లాస్థాయి హెల్ప్ లైన్ కి కాల్ చేయాలి.
• ఒకవేళ ఆ వ్యక్తి పాజిటివ్ అని నిర్ధారణ అయితే ఆ ప్రదేశాన్నంతా క్రిమిసంహారకం చేయాలి.