మాదాపూర్‌లో ఓ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. అయ్యప్ప సొసైటీ రోడ్డు వద్ద స్వేచ్ఛా స్కూలు బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. బస్సులో విద్యార్థులు ఎవరూ లేక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు రోడ్డుపై బోల్తా పడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. బస్ కామన్ పట్టి విరగడంతో ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.