ఎస్బీఐ కీలక నిర్ణయం.. ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌

By సుభాష్  Published on  7 Feb 2020 8:10 AM GMT
ఎస్బీఐ కీలక నిర్ణయం.. ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌

దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌ వినిపించింది. ఆర్బీఐ తాజా మానిటరీ పాలసీ రివ్యూ అనంతరం తన ఎంసీఎల్‌ఆర్‌ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని రుణాలపై 5శాతం బేసిస్‌ పాయింట్ల మేరకు వడ్డీ రేటు తగ్గింపును ప్రకటించింది. ఫిబ్రవరి 10 నుంచి ఈ రేట్లు అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఇక ఫండ్‌ బేస్ట్‌ 7.90 శాతం నుంచి సంవత్సరానికి 7.85 శాతానికి తగ్గిందని బ్యాంకు పేర్కొంది. ఆర్బీఐ రెపోరేటును 5.15 శాతం, రివర్స్‌ రెపోను 4.90 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. బ్యాంకుల రుణాల రేట్లను తగ్గించేందుకు వీలుగా లక్ష కోట్ల వరకు దీర్ఘకాలిక రెపో ఆపరేషన్‌ను ప్రకటించడంతో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

అలాగే మిగులు ద్రవ్యత దృష్ట్యా, టర్మ్‌ డిపాజిట్లపై బ్యాంకు చెల్లించే వడ్డీ రేట్లపై కూడా కోత విధించింది. టర్మ్‌ డిపాజిట్ల రేట్లను రిటైల్‌ విభాగంలో 10-50 బీపీఎస్‌ పాయింట్లు, బల్క్‌ విభాగంలో 25-50 బీపీఎస్‌ పాయింట్లను తగ్గించింది. ఈ వడ్డీరేటును ఫిబ్రవరి 10 నుంచి అమలవుతుందని పేర్కొంది.

Next Story