చెవి పోగు, రూపాయి బిళ్ళ ట్యాటూ.. మాస్ మహేష్ బాబు.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 May 2020 10:44 AM IST
చెవి పోగు, రూపాయి బిళ్ళ ట్యాటూ.. మాస్ మహేష్ బాబు.!

మహేష్ బాబు పరశురామ్ కాంబినేషన్ లో సినిమా మొదలు కాబోతోంది అన్నప్పటి నుండి అభిమానుల అంచనాలు ఎంతగానో పెరిగిపోయాయి. ఇక కొద్ది రోజుల కిందటే టైటిల్ 'సర్కారు వారి పాట' అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మొదలైంది. ఇది నిజమో కాదో తెలియాలి అంటే సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అయిన మే 31 వరకూ ఎదురుచూడాల్సి వచ్చింది. అనుకున్నట్లుగానే ఆరోజు వచ్చేసింది. ఉదయం 9 గంటల 9 నిమిషాలకు మహేష్ బాబు-పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు 'సర్కారు వారి పాట' అన్న టైటిల్ ను కన్ఫర్మ్ చేసేశారు.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. పోస్ట‌ర్‌లో మ‌హేష్ చెవిపోగుతో క‌నిపిస్తున్నారు. మెడ‌పై రూపాయి కాయిన్ బొమ్మ ఉండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తుంది. అంటే ఈ సినిమాలో మహేష్ బాబు ఫుల్ మనీ మైండెడ్ అని.. పక్కా మాస్ సబ్జెక్టు అని అర్థమవుతోంది. మహేష్ బాబు ఇంత మాస్ లుక్ లో చూసి చాలా రోజులే అవుతోంది. కథానాయిక విషయంలో చాలా మంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు.

2021 లో జరగబోయేది సర్కారు వారి పాట, థియేటర్లలో మన సూపర్ గ్లోయింగ్ స్టార్ ఆట , కొన సాగబోయేది బాక్సాపీస్ వేట , మా 14 రీల్స్ , మైత్రీ లకు బంగారు బాట, ఇదే మన అభిమానుల నోట మాట అంటూ నిర్మాత అనిల్ సుంక‌ర పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. మైత్రిమూవీ మేక‌ర్స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. థ‌మన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సూపర్ స్టార్ కృష్ణకు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం అయిదు గంటలకు మహేష్ బాబు అభిమానులతో మాట్లాడబోతున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా.. తన అభిమానులతో లైవ్ లో ముచ్చటించబోతున్నాడు మహేష్.

Next Story