'సరిలేరు నీకెవ్వరు' టీజర్ టాక్ అదిరింది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Nov 2019 6:04 PM IST
ముఖ్యాంశాలు
- సైనికుల గొప్పదనాన్ని చెప్పిన టీజర్
- ఈ రోజు సాయంత్రం రిలీజైన టీజర్
- అంచనాలు పెంచుతున్న టీజర్
సూపర్ స్టార్ మహేష్ బాబు – సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ . అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ టీజర్ ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూసారు. ఆఖరికి ఈ రోజు టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
ఇక టీజర్ విషయానికి వస్తే..‘మీరు ఎవరో మాకు తెలియదు అంటూ మొదలైన టీజర్ లో సైనికుల గొప్పదనాన్ని.. అలాగే మహేష్ బాబు పాత్రతో పాటు విజయశాంతి పాత్రను కూడా బాగా ఎలివేట్ చేశారు. ఇక చివర్లో ప్రకాష్ రాజ్ చెప్పిన ప్రతి సంక్రాంతికి అల్లుళ్లోస్తారు.. ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు అనే డైలాగ్ కి విశేష స్పందన లభిస్తుంది.
ఈ టీజర్ సినిమా పై అంచనాలను మరింత పెంచేసింది అని చెప్పచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే... టీజర్ అదిరింది. మహేష్, రష్మిక జంటగా.. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్న ఈ భారీ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.