కుప్పకూలిన సర్దార్ సర్వాయి పాపన్న కోట

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Oct 2020 10:34 AM GMT
కుప్పకూలిన సర్దార్ సర్వాయి పాపన్న కోట

రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు అపారమైన నష్టం వాటిల్లింది. చాలా ప్రాంతాల్లో కట్టడాలు కూలిపోయాయి. ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలోనే గోల్కొండ కోటను జయించిన తెలంగాణ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన కోట కుప్పకూలింది.

ఆయన స్వస్థలం అయిన జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం ఖిలాశాపూర్ గ్రామంలోని కోట ఇటీవల వర్షాలకు బీటలు వారింది. గురువారం ఉదయం కూలి పోయింది. అదృష్ట వశాత్తూ ఎవరికి ప్రమాదం జరగక‌పోవ‌డంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా అవ‌త‌రించి ఆరేళ్లు గ‌డుస్తున్నా కూడా మన చారిత్రక కట్టడాలను ప్రభుత్వం పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరు ఏళ్లలో ఒక్క‌రు కూడా కోట నిర్వహణ గురించి పట్టించుకోలేదు అన్నారు. 350 ఏళ్ల నాటి కోట కూలడంతో తో గ్రామస్తులతో పాటు జిల్లా వాసులు చింతిస్తున్నారు.

Next Story