క్యాన్సర్ బారిన పడ్డ సంజయ్ దత్.. హుటాహుటిన అమెరికాకు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Aug 2020 10:56 AM IST
క్యాన్సర్ బారిన పడ్డ సంజయ్ దత్.. హుటాహుటిన అమెరికాకు..!

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ క్యాన్సర్ బారిన పడ్డారు. తొలుత అనారోగ్య సమస్యలతో సంజయ్ దత్ ఆసుపత్రికి వెళ్లారు. కరోనా వైరస్ బారిన పడ్డారేమోనని భావించారు. సంజయ్ దత్ కరోనా బారిన పడలేదని.. క్యాన్సర్ బారిన పడ్డారని ఫిల్మ్ ట్రేడ్ జర్నలిస్ట్ కోమల్ నాథా మంగళవారం నాడు ట్వీట్ చేశారు.

సంజయ్ దత్ కూడా తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో తాను కొద్దిరోజుల పాటూ సినిమా షూటింగ్ లకు బ్రేక్ తీసుకుంటూ ఉన్నానని. మెడికల్ ట్రీట్మెంట్ కోసం వెళుతున్నానని తెలిపారు. నా కుటుంబం, సన్నిహితులు నాతోనే ఉన్నారని అన్నారు. నా గురించి బాధపడకండి.. వదంతులను నమ్మకండి.. మీ అందరి ప్రేమ ఆప్యాయతలతో వీలైనంత తొందరగా తిరిగి వస్తానని అన్నారు సంజయ్.

ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో శ్వాస సంబంధిత సమస్యలు, ఛాతీలో నొప్పితో చేరిన ఆయన మూడు రోజులు ఆసుపత్రిలో ఉండి డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రిలో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది.

సంజయ్ దత్ సన్నిహితుడు మీడియాతో మాట్లాడారు. సంజయ్ దత్ కి స్టేజ్-3 ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్న విషయం నిన్నఇటీవల చేసిన టెస్ట్ లలో తెలిసిందని అన్నారు. సంజయ్ దత్ చికిత్స కోసం అమెరికాకు బయలుదేరనున్నారు. ఈ క్యాన్సర్ నయమవుతుందని అందుకు వెంటనే చికిత్స తీసుకోవాలని అన్నారు. సంజయ్ దత్ నటించిన సడక్-2 సినిమా ఓటీటీలో ఈ నెలలో విడుదల కానుండగా.. కేజీఎఫ్-2 సినిమాలో కూడా నటించారు.

Next Story