కరోనా వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అన్నారు. దేశవ్యాప్తంగా ప్ర‌జ‌లు క‌రోనా వైర‌స్ ప‌ట్ల ఆందోళ‌న చెందుతున్న నేఫ‌థ్యంలో.. నేడు ఈ విష‌య‌మై సానియా స్పందించారు. క‌రోనా విష‌యంలో.. ప్రజలు ముందస్తుగా వైరస్‌ను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల‌ని అన్నారు.

క‌రోనా వైరస్ లక్షణాలపై ఏమాత్రం అనుమానం కలిగినా వెంటనే వైద్యులను సంప్రదించాల‌ని.. లేదంటే 104కు డయల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాల‌ని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ చేతులను శుభ్రప‌రుచుకోవాల‌ని.. ముఖ్యంగా చిన్నారుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల‌ని కోరారు. అలాగే.. జలుబు, దగ్గు, శ్వాస తీయడంలో ఇబ్బందులు ఎదురయితే.. వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాల‌ని అన్నారు. చివ‌ర‌గా.. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోండి.. కరోనా వైరస్‌ను తరిమికొడదాం అని పిలుపునిచ్చారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.