ఇదేం ప‌ద్ద‌తి.. వాళ్లు విఫ‌ల‌మైతే అందుకు కారణం మేమా..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 May 2020 11:13 AM IST
ఇదేం ప‌ద్ద‌తి.. వాళ్లు విఫ‌ల‌మైతే అందుకు కారణం మేమా..!

భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ‌ను వివాహాం చేసుకోగా.. పాకిస్థాన్ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్ ను భార‌త టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. మా బాధ‌లు మీకేం తెలుసున‌ని అంటోది సానియా మీర్జా.

తాజాగా భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్లు స్మృతి మంధాన‌, జెమీమా రోడిగ్స్ యూ ట్యూబ్ చాట్ షో 'డ‌బుల్ ట్ర‌బుల్‌'లో సానియా మీర్జా మాట్లాడింది. సాద‌ర‌ణంగా భ‌ర్త‌లు ఏదైన సాధిస్తే.. అది వారి గొప్ప‌త‌నంగా బావిస్తార‌ని, ఒక వేళ వాళ్లు విఫ‌ల‌మైతే మాత్రం భార్య‌ల వ‌ల్లే వాళ్లు సాధించ‌లేక‌పోయార‌ని స‌మాజం అంటుంద‌ని పేర్కొంది. ఈ విష‌యం అనుష్క శ‌ర్మ‌కు కూడా బాగా తెలుసున‌ని అంటోంది. మా భ‌ర్త‌లు క్రికెట‌ర్లు.. వాళ్లు ఆడే మ్యాచులు చూద్దామ‌ని స్టేడియానికి వెళ్తాం. ఆ రోజు వారు బాగా ఆడితే ఫ‌ర్వాలేదు. ఒక వేళ ఆరోజు వాళ్లు విఫ‌లం అయితే మాత్రం ఫ్యాన్స్ మాపై నింద‌‌లు వేస్తార‌ని, భార్య‌లు రావ‌డం వ‌ల్లే ఆ ప్లేయ‌ర్లు స‌రిగ్గా రాణించ‌లేద‌ని అంటార‌ని సానియా చెప్పింది.

ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సంద‌ర్భంగా ఆసీస్ ఆట‌గాడు మిచెల్ స్టార్క్ త‌న భార్య ఎలిసా హేలీ మ్యాచ్ చూడ‌డానికి రావ‌డంతో సానిమా మీర్జా భార్య‌కు బానిస అని ట్వీట్ చేసిన చేయ‌గా.. అది అప్పుడు వైర‌ల్ గా మారిన సంగ‌తి తెలిసిందే. కాగా.. ఈ విష‌మై సానియాను ప్ర‌శ్నించ‌గా.. ఉప‌ఖండంలో అయితే అలా చేసిన వ్య‌క్తి భార్యా విధేయుడు(జోరు కా గులామ్‌) అంటార‌ని ఆమె వివ‌రించింది. అది స‌ర‌దాగా చేసిన ట్వీట్ మాత్ర‌మేన‌ని.. కానీ అందులో చాలా అర్థం ఉంద‌ని సానియా తెలిపింది. గతంలో విరాట్‌ కోహ్లీ, షోయబ్‌ మాలిక్‌ బ్యాటింగ్‌లో విఫలమైనప్పుడు దానికి అనుష్క, సానియాలే కారణమంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

Next Story