షమీ భార్య పై మండిప‌డుతున్న నెటిజ‌న్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 May 2020 11:50 AM GMT
షమీ భార్య పై మండిప‌డుతున్న నెటిజ‌న్లు

టీమ్ఇండియా ఫాస్ట్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ స‌తీమ‌ణి హ‌సిన్ జ‌హాన్ పై నెటీజ‌న్లు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓ వీడియోనే అందుకు కార‌ణం.

ఓ బాలీవుడ్ పాట‌కు డ్యాన్స్ చేసిన హ‌సిన్ ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోలో ఆమె కొంత మేర‌కు ఎక్స్‌పోజింగ్ చేసింది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజ‌న్ల‌కు చిర్రెత్తుకు వ‌చ్చింది. దీంతో నెటిజ‌న్లు ఆమె పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు.

ఇటీవల మ‌హ్మ‌ద్ ష‌మీ.. హిట్‌మ్యాన్ రోహిత్‌తో క‌లిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడాడు. త‌న వ్య‌క్తిగ‌త‌, కెరీర్ కు సంబందించిన చాలా విష‌యాల‌ను చెప్పిన ష‌మీ.. వ్య‌క్తిగ‌త జీవితంలో ఎదురైన కొన్ని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల మూడు సార్లు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని అనుకున్న‌ట్లు చెప్పాడు.

రెండేళ్ల క్రితం షమీపై హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. షమీకి వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని.. అతని కుటుంబం తనను అనేక ఇబ్బందులు గురిచేసిందని, లైంగికంగా కూడా వేదించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, తప్పుడు వయసు పత్రాలు సమర్పించి క్రికెట్‌లోకి వచ్చాడని ఆరోపించింది.

మ్యాచ్ ఫిక్సింగ్‌, త‌ప్పుడు ప‌త్రాల‌తో క్రికెట్‌లోకి వ‌చ్చాడ‌ని హిసిన్ ఆరోపించ‌డంతో వెంట‌నే బీసీసీఐ రంగంలోకి దిగింది. విచార‌ణ జ‌రిపి ష‌మీ ఎటువంటి త‌ప్పు చేయ‌లేద‌ని అత‌డికి క్లీన్ చిట్ ఇచ్చింది. అదే స‌మ‌యంలో ష‌మీ రోడ్డు ప్ర‌మాదానికి గురైయ్యాడు. స‌రిగ్గా ఐపీఎల్ సీజ‌న్‌కు 10-12 రోజుల‌కు ముందే ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రోడ్డు ప్ర‌మాదంతో పాటు త‌న వ్య‌క్తిగ‌త జీవితం మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో తాను ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని అనుకున్నాన‌ని రోహిత్‌తో లైవ్‌లో చెప్పాడు ష‌మీ.

కాగా.. కుటుంబ స‌భ్యులు అండ‌గా నిలిచార‌ని అన్నాడు. సోద‌రుడు అయితే 24 గంట‌ల పాటు త‌న వెన్నెంటే ఉన్నాడ‌ని అన్నారు. దీంతో త‌న ఆలోచ‌న‌ను విర‌మించుకున్నాన‌ని, క్రికెట్ పై దృష్టి సారించ‌మ‌ని త‌న త‌ల్లిదండ్రులు చెప్ప‌డంతో.. వెంట‌నే అకాడ‌మికి వెళ్లి ప్రాక్టీస్ మొద‌లు పెట్టిన‌ట్లు చెప్పాడు ష‌మీ.

ష‌మి ఇబ్బందులు ఎదుర్కొన‌డానికి హ‌సిన్‌నే కార‌ణ‌మ‌ని భావించిన ఫ్యాన్స్.. తాజాగా ఆమె పై కామెంట్లతో దాడికి దిగారు. కొంద‌రు ష‌మీకి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కోరారు. మ‌రీ దీనిపై హసిన్ ఎలాగా స్పందిస్తుందో చూడాలి.

Next Story