ధోనీ చాలా సిగ్గుపడేవాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 May 2020 7:20 AM GMT
ధోనీ చాలా సిగ్గుపడేవాడు

భార‌త మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని చాలా సిగ్గుపడేవాడ‌ని టీమ్ఇండియా వెట‌ర‌న్ ఆఫ్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ తెలిపాడు. అయితే.. అది ఇప్పుడు కాదులెండి.. మ‌హీ అరంగ్రేటం చేసిన కొత్త‌లోన‌ట‌. ఇటీవ‌ల చెన్నై సూప‌ర్‌కింగ్స్ నిర్వ‌హించిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొని మాట్లాడాడు భ‌జ్జీ.

మ‌హేంద్ర‌సింగ్ ధోని కెరీర్ ఆరంభంలో డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ల‌డానికి కూడా సిగ్గు ప‌డేవాడ‌ని, ఎవ‌రితో కూడా ఎక్కువ‌గా మాట్ల‌డ‌పోయేవాడ‌ని హ‌ర్భ‌జ‌న్ సింగ్ చెప్పాడు. ఇక 2008 ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో 'మంకీ గేట్' వివాదం త‌రువాత ధోని అంద‌రితోనూ స్వేచ్ఛ‌గా మాట్లాడ‌డం ప్రారంభించాడ‌ని చెప్పుకొచ్చాడు. 'నేను, ధోని క‌లిసి చాలా క్రికెట్ ఆడాం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలా చాలా దేశాల్లో ప‌ర్య‌టించాం. 2008 వ‌ర‌కు ధోనికి చాలా సిగ్గుప‌డేవాడు. ఏమీ చెప్పేవాడు కాదు. కనీసం మా గదులకు కూడా వచ్చేవాడు కాదు. చాలా మౌనంగా ఉండేవాడు. మంకీగేట్ వివాదం జ‌ట్టును మ‌రింత ఐక‌మత్యంగా ఉండేలా చేసింది. ఇక ధోని అప్ప‌టి నుంచి త‌న అభిప్రాయాల‌ను స్వ‌చ్చ‌గా చెప్ప‌డం ప్రారంభించాడు. ఇక కెప్టెన్‌గా ధోని అంద‌రికి పూర్తి స్వేచ్ఛ నిచ్చేవాడు. బౌలింగ్ చేసేట‌ప్పుడు నాకే మాత్ర‌మే కాకుండా.. దీప‌క్ చాహ‌ర్ కి కూడా ఫ్రీడ‌మ్ ఇచ్చేవాడు' అని హ‌ర్భ‌జ‌న్ సింగ్ తెలిపాడు.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) లో ముంబై ఇండియ‌న్స్ త‌రుపున భ‌జ్జీ ప‌దేళ్ల పాటు ఆడాడు. ఇప్పుడు చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రుపున ఆడుతున్నాడు. దీనిపై భ‌జ్జీ మాట్లాడుతూ.. పదేళ్లపాటు ముంబైకి ఆడిన తాను తొలిసారి ఎల్లో జెర్సీ ధరించినప్పుడు వింతగా అనిపించిందన్నాడు. ‘చెన్నై జెర్సీ వేసుకున్న తొలిసారైతే వింతగా అనిపించింది. ముంబై తరఫున చెన్నైతో ఆడినప్పుడల్లా భారత్-పాక్ మ్యాచ్‌లా అనుకునేవాళ్లం. మ్యాచ్ కూడా చాలా టఫ్‌గా ఉండేది. కానీ ఆకస్మాత్తుగా నేను బ్లూ జెర్సీకి బదులు ఎల్లో జెర్సీ ధరించడం కష్టంగా అనిపించింది. అదృష్టవశాత్తు చెన్నై తరఫున నా తొలి మ్యాచ్ కూడా ముంబైతోనే జరిగింది. తొలి సీజన్ అంతా కొంచెం కష్టంగా అనిపించింది. టైటిల్ గెలిచిన తర్వాత మాత్రం అలవాటైపోయింది. రెండో సీజన్ బాగా సాగింది. ఇక ఆ ఫీలింగ్ కలగలేదు'అని భజ్జీ తెలిపాడు.

Next Story