ఆరెంజ్ జోన్‌లో హాయిగా బీర్ తాగుతా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 May 2020 8:57 AM GMT
ఆరెంజ్ జోన్‌లో హాయిగా బీర్ తాగుతా

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశ‌వ్యాప్త లాక్‌డౌన్‌ను మే 17 వ‌ర‌కు పొడిగించ‌గా.. గ్రీన్‌, ఆరెంజ్ జోన్ల‌ల‌లో కొన్ని సడ‌లింపులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా నేప‌థ్యంలో టీమ్ఇండియా కోచ్ ర‌విశాస్త్రి ఇంటికే ప‌రిమితం అయ్యాడు. ఆయ‌న ఉంటున్న ప్రాంతం అలీబాగ్. మొన్న‌టి వ‌ర‌కు ఇది రెన్ జోన్ లో ఉండేది. ఇప్పుడు అది ఆరెంజ్ జోన్ అయ్యింది. ఇక కేంద్రం ప్ర‌భుత్వం లాక్‌డౌన్ స‌డ‌లింపుల్లో ఇవ్వ‌డంతో మ‌ద్యం దుకాణాలు తెర‌చుకున్నాయి.

దీంతో తాను వైన్ షాప్‌కు వెళ్లి బీర్ తెచ్చుకుంటాన‌ని ర‌విశాస్త్రి తెలిపాడు. త‌న‌కు మ‌ద్యంపై ఉన్న ప్రేమ‌ను ఇప్ప‌టికే ర‌విశాస్త్రి ప‌లు సంద‌ర్భాల‌లో వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ.. చాలా మంది మ‌ద్యం షాపుల ద‌గ్గ‌ర భౌతిక దూరం పాటించ‌డం లేద‌ని, తాను మాత్రం త‌ప్ప‌కుండా భౌతిక దూరం పాటించ‌డంతో పాటు మాస్క్ ధ‌రించే షాప్‌కు వెళ్లి మ‌ద్యం తెచ్చుక‌న్నాడ‌ని చెప్పాడు. ప్ర‌స్తుత క్వారంటైన్ స‌మ‌యంలో ఓ ఇద్ద‌రితో క‌లిసి బీర్ తాగే అవకాశం ఇస్తే తాను రోజ‌న్ బిన్నీ, ల‌క్ష్మ‌ణ్ శివ‌రావ‌మ‌కృష్ణ‌ల‌తో క‌లిసి తాగుతాన‌ని చెప్పాడు.

1985లో ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్ ను గుర్తు చేసుకున్నాడు. భార‌త్, పాకిస్థాన్ ఆ ఫైన‌ల్‌లో త‌ల‌ప‌డ‌గా.. భార‌త్ విజ‌యం సాధించింది. ఆ మ్యాచ్‌లో ర‌విశాస్త్రి అజేయ అర్థ‌శ‌త‌కంతో జ‌ట్టును గెలిపించాడు. "పాకిస్థాన్‌‌ను ఆ మ్యాచ్‌లో ఓడించడం నాకు మరిచిపోలేని జ్ఞాపకం. నిజాయితీగా చెప్పాలంటే ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచేందుకు మియాందాద్ చాలా ప్రయత్నించాడు. కానీ.. అతనికి ఆడీ కారు గెలుచుకునే అవకాశం దక్కలేదని శాస్త్రి వెల్ల‌డించాడు". టోర్నీ ఆసాధ్యం రాణించిన ర‌విశాస్త్రికి ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్ని ద‌క్కింది.

Next Story