మిస్‌ యూ బ్రూనో.. కోహ్లీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 May 2020 5:32 AM GMT
మిస్‌ యూ బ్రూనో.. కోహ్లీ

భార‌త జ‌ట్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఇంట విషాదం నెల‌కొంది. విరాట్ ఎంతో ఇష్టంగా 11 ఏళ్ల నుంచి పెంచుకుంటున్న పెంపుడు కుక్క బ్రునో బుధ‌వారం ఉద‌యం మృతి చెందింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ కోహ్లీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేశాడు. "రెస్ట్ ఇన్ పీస్ బ్రునో. 11 ఏళ్ల మన ప్రయాణం జీవితాంతం ఓ తీపి​ గుర్తుగా మిగిలిపోతుంది. ఈరోజు ఇక్కడి నుంచి వేరు చోటుకు వెళ్లావు. నీ ఆత్మకు శాంతి చేకూరేలాని దేవుడుని కోరుకుంటున్నా." అంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఇక కోహ్లీ భార్య బాలీవుడ్ అనుష్క శ‌ర్మ సైతం త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో "మిస్ యూ బ్రూనో.. రిప్" అంటూ పోస్టు చేసింది.

బున్రోతో కోహ్లీకి మంచి అనుబంధం ఉండేది. ఈ విష‌యాన్ని విరాట్ ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో సైతం చెప్పాడు. బ్రునో త‌మ కుటుంబ స‌భ్యుల‌లో ఒక‌టి అని గ‌తంలో విరాట్ వ్యాఖ్యానించాడు. సోష‌ల్ మీడియాలో సైతం విరాట్ బున్రో తో క‌లిసి దిగిన ఫోటోల‌ను షేర్ చేస్తుండేవాడు.



Next Story