అద్భుతం : 'ఇండియ‌న్ మెస్సీ' దొరికాడు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 May 2020 3:18 AM GMT
అద్భుతం : ఇండియ‌న్ మెస్సీ దొరికాడు

పుట్‌బాల్‌.. ప్ర‌పంచంలోనే అత్యంత జ‌నాధ‌ర‌ణ క‌లిగిన క్రీడ‌. దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఫీలే, మ‌ర‌డొనాల కాలం నుండి నిన్న‌మొన్న‌టి బెక్‌హ‌మ్, జిదాన్‌.. నేటి రొనాల్డో, మెస్సీ, నెమ‌ర్ ల వ‌ర‌కూ ప్ర‌పంచ‌వ్యాప్తంగా పుట్‌బాల్‌కు అభిమానులున్నారు. భార‌త్‌లో అంత‌గా పుట్‌బాల్ ప‌ట్ల క్రేజ్ లేకున్నా.. ఐఎస్ఎల్‌(ఇండియ‌న్ సూప‌ర్ లీగ్‌) రాక‌తో కుర్రాళ్లు పుట్‌బాల్ ప‌ట్ల ఆక‌ర్షితుల‌వుతున్నారు. అయితే క‌రోనా కార‌ణంగా మైదానాల‌న్ని బోసిపోగా.. క్రీడాకారులంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఇళ్లల్లోనే ఉంటూ సోషల్ మీడియాలో విభిన్న‌మైన‌ పోస్టులు చేస్తూ ఫ్యాన్స్‌తో కనెక్ట్ అవుతున్నారు.ఇదిలావుంటే.. ఓ కుర్రాడు త‌న‌ అభిమాన పుట్‌బాల‌ర్‌ను ఇమిటేట్ చేస్తూ పోస్టు చేసిన‌ ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ‌ వైరల్ అవుతోంది. వివ‌రాళ్లోకెళితే.. కేరళ రాష్ట్రం మల్లాపురంకు చెందిన 12 ఏళ్ల మిషాల్ అబోలైస్ ఒక్క వీడియోతో నెట్టింట‌ స్టార్ అయ్యాడు. త‌న అభిమాన ఆట‌గాడు మెస్సీని అనుక‌రిస్తూ.. ఈ కుర్రాడు ఫుట్‌బాల్‌తో ఆ ఫీట్ చేశాడు. ఇప్పుడు ఆ ఫీట్‌కు నెట్టింట ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది.

M1

ముందుగా.. గోల్‌పోస్టుకు ఒక రింగ్ త‌గిలించాడు. త‌ను పుట్‌బాల్‌తో పాటు గోల్‌పోస్టుకు దూరంగా వ‌చ్చి నిల‌బ‌డ్డాడు. ఇక గోల్‌పోస్టుకు వేలాడదీసిన రింగ్‌ను లక్ష్యంగా చేసుకుని బంతిని కొట్టి సక్సెస్ అయ్యాడు. మ‌రో విష‌య‌మేమిటంటే.. మిషాల్ అబోలైస్ ఆ గోల్ చేసిన స‌మ‌యంలో త‌న అభిమాన ఆట‌గాడు మెస్సీ పేరుతో ఉన్న జెర్సీని ధ‌రించాడు. గోల్ కొట్టేముందు.. కొట్టిన అనంత‌రం మెస్సీ మాదిరిగానే త‌న హావ‌భావాలు ప్ర‌ద‌ర్శిస్తూ ఆక‌ట్టుకున్నాడు. ఈ వీడియోను.. కేరళ సెవెన్స్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఫేస్‌బుక్‌ పేజ్‌పై వీడియోను పోస్టు చేయడం జరిగింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

M2

ఇక కేర‌ళ‌లోని కట్టుముంద ప్రాంతానికి చెందిన మిషాల్ అబోలైస్. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. తన సోద‌రుడు వాజిద్ ప్రోత్సహంతో పుట్‌బాల్‌పై దృష్టిపెట్టిన మిషాల్ అబోలైస్..‌ గత నాలుగేళ్లుగా కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ వీడియోను చ‌సిన నెటిజ‌న్లు ఇండియ‌న్ మెస్సీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మిషాల్ అబోలైస్‌కు ఇష్ట‌మైన ఆట‌గాడు కూడా మెస్సీ కావ‌డంతో ఆనందంలో మునిగి తేలుతున్నాడు.

Next Story