"సంచయిత” చుట్టూ ఏపీ రాజకీయం.!

By అంజి  Published on  7 March 2020 9:26 AM GMT
సంచయిత” చుట్టూ ఏపీ రాజకీయం.!

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఏపీలో ఓపక్క ఎన్నికల వేడి రాజుకుంటుండగా.. అదేస్థాయిలో మరోపక్క సంచయిత చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. సంచయిత సింహాచలం ఆలయ ట్రస్ట్, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించటమే ఇందుకు కారణం. సింహాచలం ఆలయానికి గజపతిరాజుల కుటుంబం శాశ్వత ధర్మకర్తలుగా ఉంటున్నారు. 1958లో దివంగత పీవీజీ రాజు మహారాజు అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌ (మాన్సాస్‌)ను ప్రారంభించారు. మాన్సాస్ విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. అదే ఏడాదిలో పీవీజీ రాజు వ్యవస్థాపక చైర్మన్‌ కాగా ఆనంద గజపతిరాజు అశోక గజపతిరాజు ట్రస్ట్ బోర్డు సభ్యలుగా ఉన్నారు. 1994లో పీబీజీ రాజు మరణం తర్వాత ఆనంద గజపతిరాజు చైర్మన్ అయ్యారు. 2016లో ఆయన మరణం తర్వాత అశోక్ గజపతిరాజు చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం గజపతిరాజు చైర్మన్‌ హోదాలో కొనసాగుతుండగానే వైసీపీ ప్రభుత్వం ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజును మాన్సప్ చైర్మన్గా నియమించి సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీ రాజకీయాల్లో ఈఅంశం చర్చకు దారితీసింది. రాత్రికిరాత్రే ప్రభుత్వం జీవో జారీ చేయడం.. గురువారం ఉదయం ఆమె సింహాచలం ట్రస్ట్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష టీడీపీ తీవ్ర స్థాయిలో తప్పుబట్టింది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

బీజేపీసైతం ఎదురుదాడి..

సింహాచలం ట్రస్ట్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సంచయిత బీజేపీ సభ్యురాలు. కాగా బీజేపీ నేతలకు తెలియకుండా రాత్రికిరాత్రే జీవో జారీ కావటం.. వెంటనే ప్రమాణ స్వీకారం చేయటం జరిగిపోవటంతో ఆపార్టీ నేతలు సైతం మండిపడ్డుతున్నారు. సంచయితను బీజేపీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాంఢ్ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్‌ నేత విష్ణుకుమార్ రాజులు వైకాపా నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. సింహాచలం ట్రస్ట్ బోర్డు, మాన్సాప్‌ ట్రస్ట్ చైర్మన్ మార్పు రాజకీయాల్లో దురదృష్టకరమని వారు వ్యాఖ్యానించారు. సంచయిత గజపతిరాజు విజయనగరంలో ఎంతకాలం నుంచి ఉన్నారని, సింహాచలం నుంచి ఎన్నిసార్లు వచ్చారని ప్రశ్నించారు. పదవీ వ్యామోహంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. వేల ఎకరాల దేవాలయ భూములను కొట్టేసేందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. బీజేపీ సభ్యురాలిగా ఉన్న సంచయితను ట్రస్ట్ అధ్యక్షురాలిగా నియమిస్తే బీజేపీ మద్దతు ఉంటుందని భావించిన వైసీపీ నేతలకు బీజేపీ నేతల వ్యాఖ్యాలు షాక్‌నిచ్చిట్లయింది.

Also read:

జగన్‌ ప్రభుత్వంపై అశోక్‌ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు

బాబాయ్‌.. అమ్మాయ్ మాటల యుద్ధం..

సింహాచలం ట్రస్ట్ బోర్డు అధ్యక్షురాలిగా సంచయిత బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల తరువాత అశోక్ గజపతిరాజు స్పందించారు. ట్రస్ట్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాచలం ఆలయం పరిధిలో 105ఆలయాలు, విలువైన భూములు ఉన్నాయని, ఆ భూములపై కొందరు కన్నేశారని, అందుకే ట్రస్టుకు రాజకీయ రంగు పులిమారని విమర్శించారు. రాత్రికి రాత్రే దొంగతనంగా జీవో ఇచ్చారని, ఇప్పటి వరకు జీవోను బయటపెట్టలేదని అన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తామని అశోక్‌గజపతిరాజు అన్నారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా వేరే మతం వారిని నియమిస్తే సమస్యలు వస్తాయని సంచయిత పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అశోక్‌గజపతిరాజు వ్యాఖ్యలకు సుంచరిత సైతం ధీటుగా కౌంటర్‌ ఇచ్చింది. తనపై విమర్శలు చేసేవారు తన పనితనం చూసి మాట్లాడాలంటూ సంచయిత మండిపడింది. నేను హిందువునని, నా మతం గురించి బాబాయ్ మాట్లాడటం బాధకలిగించిందని అన్నారు. వాటికన్ సిటీ వెళ్లి చర్చిముందు ఫొటో దిగితే నేను క్రిస్టియన్‌ను అవుతానా అంటూ ప్రశ్నించింది. అశోక్‌ గజపతిరాజు ముసీదులు, చర్చలు సందర్శింస్తారు.. ఆయన్ను ఏ మతం అంటారు అంటూ ఘాటుగా ప్రశ్నించింది. ఇలా కుటుంబ సభ్యులతో పాటు, పార్టీల నేతలుసైతం విమర్శలు, పతివిమర్శలు చేసుకుంటుండటంతో ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది.

Next Story