టాలీవుడ్‌ నటుడు, బిగ్‌బాస్- 2 కంటెస్టెంట్ సామ్రాట్ రెడ్డి పెళ్లి పీటలు ఎక్కాడు. కాకినాడలో జరిగిన వివాహ వేడుకలో శ్రీలిఖితను వివాహం చేసుకున్నాడు. సామ్రాట్‌కు ఇది ద్వితీయ వివాహం. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన సామ్రాట్.. తాజాగా రెండో పెళ్లి చేసుకున్నాడు.

కరోనా కారణంగా సామ్రాట్ పెళ్లి నిరాడంబరంగా అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలను సామ్రాట్ సోదరి, మోడల్ శిల్పారెడ్డి ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. సామ్రాట్ వివాహానికి బిగ్‌బాస్-2 పార్టిసిపెంట్లు తనీష్, దీప్తీ సునైన హాజరయ్యారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story