క‌రోనా మ‌హ‌మ్మారి పుట్టిన చోట సంపూ సినిమా షూటింగ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 May 2020 7:28 PM IST
క‌రోనా మ‌హ‌మ్మారి పుట్టిన చోట సంపూ సినిమా షూటింగ్‌

'హృద‌య కాలేయం' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సంపూర్ణేష్ బాబు. ఆ సినిమా త‌రువాత సంపు న‌టించిన చిత్రాలు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాయి. 'కొబ్బ‌రి మ‌ట్ట' అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బ‌ర్నింగ్ స్టార్ ఓ మోస్తారు విజ‌యాన్ని అందుకున్నాడు. సినిమాల ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా ప్ర‌తి సినిమాలో ఏదో ఒక ప్ర‌యోగం చేయ‌డం సంపూకి అల‌వాటే. కాగా.. నేడు ఈ బ‌ర్నింగ్ స్టార్ పుట్టిన రోజు.

అంద‌రిలా ఉంటే.. సంపూ ఎలా అవుతాడు. అందుక‌నే త‌న‌కు తానుగా వెరైటీగా విషెస్ చెప్పుకున్నాడు. "అందరి హీరోల అభిమానుల తరపున నాకు నేనే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ.. సదా మీ ప్రేమకి బానిస మీ సంపూర్ణేష్ బాబు" అంటూ సంపూ ట్వీట్ చేశాడు.

సంపూ ప్రస్తుతం మెడికల్ హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. సంపూ పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర బృందం పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఇంకా ఈ చిత్రానికి పేరు కూడా పెట్ట‌లేదు. ఇక ఆపోస్ట‌ర్ల‌లో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే.. వుహాన్ గ‌బ్భిలాల మార్కెట్ లో చిత్రీక‌రించిన చివ‌రి సినిమా ఇదే అంటూ రాసారు.

Sampoo new movie first look

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి పుట్టిన చెనాలోని వుహాన్ న‌గ‌రంలో అన్న సంగ‌తి తెలిసిందే. ఇది చదివిన ప్రతీ ఒక్కరికి అసలు సంపూ టీమ్ వుహాన్ ఎప్పుడు వెళ్ళింది? ఇంకా గబ్బిలాల మార్కెట్లో షూటింగ్ ఎప్పుడు జరిపిందని.. ఆశ్చర్యానికి అనుమానాలకు గురవుతున్నారు. సంపూ ఈ పోస్టర్ లో డిఫరెంట్ స్టైల్ లుక్ లో కనిపిస్తున్నాడు. సంపూ చుట్టూ కరోనా వైరస్ స్ప్రెడ్ అయింది. ఇక ఈ సినిమాలో కరోనా వైరస్ తో సంపూ పోరాటం సాగిస్తాడని హింట్ ఇస్తున్నట్లు అర్ధమవుతుంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రం జూలై 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. హృద‌యం కాలేయం సినిమాలో కంప్యూటర్‌ కనిపెట్టినట్టు ఈ చిత్రంలో కరోనా వైరస్‌కి ఏమ‌న్నా మందు క‌నిపెడ‌తాడో లేదో తెలియాలంటే.. సినిమా విడుద‌ల వ‌ర‌కు ఆగ‌క త‌ప్ప‌దు.

Sampoo new movie first look

Next Story