టిక్‌టాక్‌లోకి మంచు విష్ణు ఎంట్రీ అదుర్స్‌.. వీడియో వైర‌ల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 May 2020 1:22 PM GMT
టిక్‌టాక్‌లోకి మంచు విష్ణు ఎంట్రీ అదుర్స్‌.. వీడియో వైర‌ల్‌

క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం కేంద్రం దేశ‌వ్యాప్త లాక్‌డౌన్‌ను విధించింది. దీంతో సెల‌బ్రెటీలు అంతా ఇంటికే ప‌రిమితం అయ్యారు. కాగా.. ఎన్నాళ్ల నుంచో వాయిదా వేసిన ప‌నుల‌ను ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. ట్విట్ట‌ర్, ఫేస్ బుక్‌, ఇన్ స్టాగ్రామ్ వంటి సోష‌ల్ మీడియా యాప్‌లు అల‌రిస్తుండ‌గా.. తాజాగా వీటి జాబితాలో టిక్‌టాక్ కూడా చేరింది. ప్ర‌స్తుతం టిక్‌టాక్ బాగా ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

తాజాగా హీరో మంచు విష్ణు కూడా టిక్‌టాక్‌లోకి వ‌చ్చేశాడు. ఈ విష‌యాన్ని విష్ణు త‌న ట్విట్ట‌ర్ లో వెల్ల‌డించాడు. 'హలో టిక్‌టాక్! నేను వచ్చేశా. లెట్స్ హేవ్ ఫన్' అని ట్వీట్ చేశాడు. దాంతో పాటు ఓ ఆసక్తికర వీడియోను పోస్టు చేశాడు. మ‌ల్టీపుల్ క్యారెక్టర్ల‌తో విష్ణు ఎంట్రీ అదిరిపోయింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కాగా.. విష్ణు ప్ర‌స్తుతం 'మోస‌గాళ్లు' అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రంలో విష్ణు స‌ర‌స‌ర కాజ‌ల్ న‌టిస్తుండ‌గా.. క‌రోనా కార‌ణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా ప‌డింది.Next Story