ప‌వ‌న్ స‌ర‌స‌న అనుష్క‌..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 May 2020 3:08 PM GMT
ప‌వ‌న్ స‌ర‌స‌న అనుష్క‌..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ 'వ‌కీల్ సాబ్' చిత్రంతో మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. వ‌రుస సినిమాలో ప‌వ‌న్ బిజీగా ఉన్నారు. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ చిత్రం ఈ పాటికే ప్రేక్ష‌కుల ముందుకు వచ్చేది. అయితే.. క‌రోనా కార‌ణంగా ఈ చిత్ర విడుద‌ల వాయిదా ప‌డింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ .. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కూడా క‌రోనా కార‌ణంగా నిలిచిపోయింది. అయితే.. ప్ర‌స్తుతం ఈ చిత్రం పై ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.

రాబిన్‌ హుడ్‌ కాన్సెప్ట్‌తో హిస్టారికల్‌ యాక్షన్‌ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌ బందిపోటు పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. కాగా.. ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న స్వీటి అనుష్క ని తీసుకున్నార‌ట‌. ఈ చిత్ర క‌థ‌ను అనుష్క‌కు వీడియోకాల్‌లో వినిపించార‌ని, అనుష్క కూడా ఈ చిత్రంలో న‌టించేందుకు ఒప్పుకుంద‌ని అంటున్నారు. అయితే.. ఈ చిత్రం కోసం తొలుత బాలీవుడ్ భామ జాక్వెలిస్ ఫెర్నాండెజ్‌ను తీసుకున్నార‌ని వార్త‌లు వినిపించాయి. అందులో ఎంత నిజం ఉందో తెలీదు. కాగా.. ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్ల‌కు అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు.

ఇక ప‌వ‌న్-క్రిష్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న మొద‌టి చిత్రం కావ‌డంతో.. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. పైగా హిస్టారిక‌ల్ మూవీల‌ను తెర‌కెక్కించ‌డంతో క్రిష్ ది అంద‌వేసిన చేయి కావ‌డంతో.. ప‌వ‌న్‌ను ఈ చిత్రంలో ఎలా చూపించ‌బోడున్నాడోన‌ని అత‌ని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story
Share it