మహారాష్ట్ర సర్కార్‌పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

By సుభాష్  Published on  20 Aug 2020 10:28 AM GMT
మహారాష్ట్ర సర్కార్‌పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసుపై రాజకీయ దుమారం రేపుతోంది. ఇక మహారాష్ట్ర సర్కార్‌ అధికారం కోల్పోతుందని బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్‌ పాత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన స్వాగతించారు. అంతేకాదు.. మహారాష్ట్ర ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. ఇప్పటి వరకూ మొద్దునిద్ర పోతున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గగ్గోలు పెడుతోందని ఆయన ఎద్దేవా చేశారు.

అంతేకాకుండా అటు సుశాంత్‌ ఫ్యామిలీపై సంజయ్‌ రౌత్‌ విమర్శలకు దిగారు. ఇప్పుడు ప్రభుత్వం రోధన చేస్తోందని, మిత్రులారా త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఇంటిదారి పట్టిందనే వార్త మనం వింటున్నాం.. అంటూ సంబిత్‌ పాత్ర ఓ ట్విట్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వంపై వ్యంగ్యాస్తాలు గుప్పించారు. శివసేన=సోనియా+రియా=సోరియా సేన (నిద్రపోతున్న సేన) అని వ్యాఖ్యనించారు. మహారాష్ట్ర సర్కార్‌ పక్షపాత ధోరణికి సుప్రీంకోర్టు తీర్పుతో పెద్ద దెబ్బ తగిలిందని అన్నారు. సుశాంత్‌ మరణంపై సీబీఐ విచారణలో అసలు నిజాలు బయటకు వస్తాయని ఆయన పేర్కొన్నారు.



Next Story