ధోని రిటైర్మెంట్ పై సాక్షి రియాక్షన్ ఇదే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Aug 2020 3:25 AM GMT
ధోని రిటైర్మెంట్ పై సాక్షి రియాక్షన్ ఇదే..!

గతంలో మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ అవుతున్నారంటూ వార్తలు ఏవైనా రావడం ఆలస్యం ఆయన సతీమణి 'సాక్షి' ఆ వ్యాఖ్యలను వెంటనే ఖండించేది. గతంలో ధోని రిటైర్మెంట్ పై వ్యాఖ్యలు రావడం వాటిపై వెంటనే సాక్షి స్పందించడం జరిగింది. ధోని రిటైర్మెంట్ అంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్ అయిన ప్రతిసారీ కూడా కొందరు పనిగట్టుకుని ధోని రిటైర్మెంట్ మీద వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించింది.

ఇక ధోని రిటైర్మెంట్ ఇచ్చేశాడు. అందరూ సాక్షి ఏమని చెబుతుందా అని ఎదురుచూసారు. ధోని తాను రిటైర్మెంట్ ను ప్రకటిస్తున్నానంటూ ఇంస్టాగ్రామ్ లో ప్రకటించడంతో ఆ పోస్టుపై పలువురు స్పందించారు. ధోనిని ఇక బ్లూ కలర్ జెర్సీలో చూడలేమా అంటూ అభిమానులు ఎంతగానో బాధపడ్డారు. లెజెండ్ ను భారత్ జెర్సీలో ఇంకో మ్యాచ్ లో చూసుంటే బాగుండేదని ఎంతో మంది చెప్పుకొచ్చారు. పలువురు ప్రముఖులు స్పందించారు.

ధోని బెటర్ హాఫ్ సాక్షి ఆ వీడియో కింద తన స్పందన తెలియజేశారు. లవ్ సింబల్ పెట్టడమే కాకుండా.. చేతులు జోడించిన ఈమోజీ కూడా పెట్టారు. ధోని అభిమానులు కూడా ఆ లైక్ లకు కామెంట్లు పెడుతూ వస్తున్నారు.

Next Story