ఆ బ్యాడ్మింటన్ ప్లేయర్.. ఓ ఇంటివాడయ్యాడు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Dec 2019 11:42 AM ISTభారత బ్యాడ్మింటన్ ఆటగాడు భమిడిపాటి సాయిప్రణీత్ ఓ ఇంటివాడయ్యాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్వేత జయంతితో సాయిప్రణీత్ వివాహం జరిగింది. ఆదివారం కాకినాడలోని ఓ పంక్షన్ హాల్‌లో వీరిద్దరి వివాహవేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహ వేడుకకు సాత్విక్ సాయిరాజు సహా పలువురు బ్యాడ్మింటన్ క్రీడాకారులు హాజరయ్యారు.
ఇక సాయిప్రణీత్-శ్వేత జంటకు సోషల్ మీడియా ద్వారా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలావుంటే.. సాయిప్రణీత్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 36 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్‌లో కాంస్యం గెలిచిన భారత ప్లేయర్‌గా నిలిచాడు. గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న సాయిప్రణీత్‌ను ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ‘అర్జున అవార్డు’తో సత్కరించింది.
Next Story