Fact Check : సాగర్ రత్న రెస్టారెంట్ లో ఒక థాళీ  కొంటే రెండు థాళీలను ఉచితంగా ఇస్తున్నారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Jun 2020 6:45 AM GMT
Fact Check : సాగర్ రత్న రెస్టారెంట్ లో ఒక థాళీ  కొంటే రెండు థాళీలను ఉచితంగా ఇస్తున్నారా..?

లాక్ డౌన్ సమయంలో దేశ వ్యాప్తంగా హోటల్స్, రెస్టారెంట్లను క్లోజ్ చేశారు. ఇప్పుడు ఓపెన్ చేసినా కూడా ప్రజలు రెస్టారెంట్ లకు వెళ్లాలంటే భయపడుతూ ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో కొన్ని ప్రముఖ రెస్టారెంట్లకు సంబంధించిన ఆఫర్లు వైరల్ అవుతున్నాయి. సాగర్ రత్న, మహారాజా భోగ్ లాంటి రెస్టారెంట్లలో ఒక థాళీ కొంటె రెండు థాళీలను ఉచితంగా ఇస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి.

‘BUY 1 THALI AND GET 2 THALI FREE ON FIRST ORDER CALL NOW 8389850867’ అన్న ఫేస్ బుక్ పోస్ట్ కు సాగర్ రత్న హోటల్ ఫోటోను యాడ్ చేసి వైరల్ చేస్తున్నారు.

మిగిలిన రెస్టారెంట్లకు సంబంధించి కూడా ఇదే తరహా పోస్ట్ లు వైరల్ అవుతూ ఉన్నాయి.

నిజ నిర్ధారణ:

ఈ ఫేస్ బుక్ పోస్ట్ ఉన్న పేజీలో ఈ వైరల్ పోస్టు తప్ప మరేదీ లేదు. పేజీని కూడా జూన్ 17, 2020న క్రియేట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో సాగర్ రత్న రెస్టారెంట్ ఫ్రాంచైజీలు బాగా ఫేమస్ అవడంతో పలువురు ఇది నిజమేనేమో అని షేర్ చేస్తున్నారు.

Sr1

సాగర్ రత్నకు సంబంధించిన అఫీషియల్ పేజ్ ను ఓపెన్ చేయగా 'ఒక థాళీ కొంటే రెండు థాళీలు ఉచితం' అన్న ఆఫర్ అసలు అమలు చేయడం లేదని.. ప్రజలను మోసం చేయడానికి ఇలాంటి పోస్టులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారని.. అలాంటి వారికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి మోసపోకండని.. దీనికి సాగర్ రత్నకు ఎటువంటి సంబంధం లేదని.. ఏదైనా ఆర్డర్లు చేయాలంటే www.sagarratna.in ను సంప్రదించాలని ఫేస్ బుక్ పోస్ట్ లో తెలిపారు.

“Disclaimer: We hereby inform all our esteemed patrons that it has come to our notice that some fraudsters are luring public with offers from Sagar Ratna like ‘Buy one Thali and get Two Thali free’. These ads/offers may be phishing activities that may lead to commercial loss at your end for which Sagar Ratna cannot be held responsible. You are advised not to pay heed to any such offers as it is not endorsed by us. For more information, online ordering or loyalty offers, please visit us at www.sagarratna.in.”

ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంచైజీలు ఉన్న మహారాజా భోగ్ కూడా ఇదే తరహాలో పోస్టు పెట్టింది. తమ సంస్థ పేరును వాడుకుని కొందరు మోసగాళ్లు ఇలాంటి పనులు చేస్తున్నారని దయచేసి వారి పడకండి అని సంస్థ తెలిపింది. అవుట్ లెట్స్ వద్ద క్రాస్ చెక్ చేసుకుని వెళ్లాలని.. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా Website: http://www.maharajabhog.com/ E-mail: info@maharajabhog.com సంప్రదించాలని సంస్థ కోరింది. సామాజిక మాధ్యమాల్లో ఒకటి కొంటే రెండు ఫ్రీ అన్న మెసేజీలు కొందరు మోసగాళ్లు చేస్తున్న పని అని వాటిని నమ్మకండి అని తమ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

కాబట్టి మహారాజా భోగ్, సాగర్ రత్న లాంటి రెస్టారెంట్లలో ఎటువంటి ఆఫర్లను ఇవ్వండం లేదు. ఇది తప్పుడు వార్తనే.

Claim Review:Fact Check : సాగర్ రత్న రెస్టారెంట్ లో ఒక థాళీ  కొంటే రెండు థాళీలను ఉచితంగా ఇస్తున్నారా..?
Claim Fact Check:false
Next Story