ఈ ఆదివారం ఏర్పడ్డ సూర్యగ్రహణానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. అటువంటి వాటిలో తైవాన్ కు చెందిన ఓ వీడియో కూడా ఉంది. జూన్ 21, 2020 నాడు తైవాన్ లోని చియీ నగరంలో ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణాన్ని ఓ సరస్సు మీద నుండి కెమెరాల్లో బంధించాలని పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడారు. పొగమంచులో ఆ సూర్యగ్రహణాన్ని బంధించాలని ప్రతి ఒక్కరూ కెమెరాలను తీసి క్లిక్ మనిపిస్తున్నారు. అందరూ ఒకరికొకరు దగ్గరగా నిలబడి ఉన్నారు. సరస్సు అంచున అంత మంది నిలబడి ఉండడంతో సందడి నెలకొంది. అలా ప్రజలను చూపించిన వీడియో కెమెరాను తిప్పగా.. సూర్యుడు చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

11

నిజనిర్ధారణ:

ఈ వీడియో చివర్లో వచ్చిన విజువల్స్ ‘ఫేక్’

https://www.youtube.com/watch?time_continue=2&v=XlzXJZ_J37k&feature=emb_title

ఈ వీడియో జనవరి 27, 2020న వేణు గోపాల్ అనే యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశాడు. కిందకు దిగుతున్న సూర్యుడు అంటూ ఆ వీడియోకు టైటిల్ పెట్టాడు.

గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఎన్నో వింత వింత వీడియోలు లభించాయి. మదర్ మేరీ మేఘాల్లో కనిపిస్తుండగా అక్కడి ప్రజలంతా సందడిగా చూస్తున్న వీడియోను గమనించవచ్చు. వివిధ సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వీడియోలను చూడొచ్చు. ఒకే వీడియోకు వివిధ వెర్షన్లను ఉంచారు. అది కూడా ఎవరికి తగ్గట్టుగా వారు ఎడిట్ చేసుకున్నారు.

https://www.facebook.com/watch/?v=1034244173597941

https://vk.com/video587010392_456239018

 Falsoo.com అనే అరబిక్ వెబ్ సైట్ లో మదర్ మేరీకి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో కాంట్రవర్సీకి దారి తీసిందని చెబుతూ ఆర్టికల్ ను డిసెంబర్ 7, 2019న పబ్లిష్ చేశారు. అర్మేనియా రాష్ట్రంలో ఓ సరస్సు పైన మేఘాల్లో వర్జిన్ మేరీ కనిపించిందని అందరూ భావిస్తున్నారని అందులో రాసుకుని వచ్చారు.

ఈ వీడియో ఎడిటింగ్ చేసినదే..! చైనా-నార్త్ కొరియా సరిహద్దు ప్రాంతంలోని ‘టియాంచీ సరస్సు’ లేదా ‘లేక్ స్కై’ వద్ద తీసినది. మౌంట్ బేక్డూ వద్ద ఈ సరస్సు ఉంది. టూరిస్టులు అక్కడికి వచ్చి ఫోటోలు తీసుకుంటున్నది నిజమైన వీడియోనే.. ఎప్పుడైతే అలా మేఘాలవైపుకు తిప్పారో అప్పుడు వచ్చిన వర్జిన్ మేరీ విజువల్ ఎడిటింగ్ చేసినది. మదర్ మేరీ వీడియోను ఎడిటింగ్ చేశారని ఆ ఆర్టికల్ లో స్పష్టం చేశారు.

ఇప్పుడు కూడా అదే వీడియోకు చివరిలో సూర్యుడిని యాడ్ చేసి వీడియోను వైరల్ చేస్తూ వచ్చారు. ఇక మొన్ననే సూర్య గ్రహణం రావడంతో నిజమేనని నమ్మి చాలా మంది షేర్ చేయడం మొదలుపెట్టారు.

Mount Baektu లేదా Mount Paektu ను సెర్చ్ చేయగా అక్కడికి సంబంధించిన ఫోటోలు వీడియోలు చూడొచ్చు. ఉత్తర, దక్షిణ కొరియా వాసులు ఈ ప్రాంతాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ ప్రాంతానికి సంబంధించిన వెబ్ సైట్ ఆర్టికల్స్ ను గమనించవచ్చు. వీడియోలను కూడా చూడొచ్చు.

https://english.kyodonews.net/news/2017/10/3a5adcbe8716-gallery-chinese-tourists-flock-to-north-korean-border.html?phrase=ohashi&words=

https://www.north-korea-travel.com/monte-paektu.html

https://www.facebook.com/watch/?v=2569578916386638

https://www.youtube.com/watch?v=Szy2R_6d4kA&feature=emb_title

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో పచ్చి అబద్ధమే కాకుండా.. ఆ ప్రాంతం తైవాన్ లో కూడా లేదు. నార్త్ కొరియా చైనా సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఈ వీడియోను చివర్లో ఎడిట్ చేసి సూర్యుడు కిందకు వచ్చాడు అని నమ్మించడానికి ప్రయత్నించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *