సాగర్ బుద్ధవనంపై కేసీఆర్ చిత్రం తొలగింపు!!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Sep 2019 5:12 AM GMTనాగార్జునసాగర్: నిర్మాణదశలో ఉన్న బుద్ధవనం మహాస్తూపంపై సీఎం కేసీఆర్ చిత్రం చెక్కారు. బుద్ధుడికి కేసీఆర్ పుష్పాంజలి ఘటిస్తున్నట్లుగా దాన్ని మలిచారు. అయితే, ఉన్నట్లుండి మహాస్తూపం మీద నుంచి కేసీఆర్ చిత్రం తొలగించారు. యాదాద్రి ప్రధానాలయ ప్రాకార మండపంలోని రాతి స్తంభాలపై చెక్కిన చిత్రాలపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధ్దవనంలోని కేసీఆర్ చిత్రాన్ని కూడా అధికారులు తొలగించి ఉంటారని భావిస్తున్నారు.
బుద్ధుడు నడయాడిన నేల కావడంతో నాగార్జునసాగర్‌లో తథాగథుడి బాల్యం నుంచి నిర్యాణం వరకు చిత్రాలు చెక్కారు. బౌద్ధజాతక కథలు, మహాస్తూపాలతో ఈ బుద్ధవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాగా మహాస్తూపంపై కేసీఆర్ చిత్రాన్ని ఏర్పాటు చేయడంపై బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్యను వివరణ కోరడం జరిగింది. అయితే.. సీఎం చిత్రాన్ని ఏర్పాటు చేయాలని చెక్కించామన్నారు. అది సరిగా రాకపోవడంతో ఇంకా స్తూపంపై పెట్టలేదన్నారు.
Attachments area