'సాహో' సుజిత్ తదుపరి చిత్రం ఎవరితో..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Nov 2019 4:12 PM IST'రన్ రాజా రన్' సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. తొలి చిత్రంతోనే విజయం సాధించి.. మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న యువ దర్శకుడు సుజిత్. ఆతర్వాత రెండో సినిమాతోనే బాహుబలి ప్రభాస్ ను డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ సొంతం చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇలా అనతి కాలంలోనే అటు ఆడియన్స్, ఇటు ఇండస్ట్రీ దృష్టి ఆకర్షించిన సుజిత్ 'సాహో' సినిమాతో సౌత్ ఆడియన్స్ ని మెప్పించలేకపోయినా... నార్త్ ఆడియన్స్ ని మాత్రం బాగానే మెప్పించాడు.
అందుకనే 'సాహో' సినిమా నార్త్ లో దాదాపు రూ.150 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ తదుపరి చిత్రం ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. తాజా వార్త ఏంటంటే... తనకు దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన శర్వానంద్ తోనే నెక్ట్స్ మూవీ చేసేందుకు సుజిత్ ప్లాన్ చేస్తున్నాడట. శర్వాకు సరిపోయే కథ రెడీ చేస్తున్నాడట. త్వరలోనే శర్వాకు కథ చెప్పనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం శర్వానంద్ '96' రీమేక్ లో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కావాలి కానీ.. ఫిబ్రవరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.
సుజిత్ తదుపరి చిత్రాన్ని ఏ సంస్థ నిర్మించనుంది.? ఎప్పుడు ప్రారంభం..? ఏ తరహా చిత్రం..? తదితర వివరాలు తెలియాల్సివుంది. మరి... సాహో సినిమాతో సక్సెస్ సాధించలేకపోయినా సుజిత్ తదుపరి చిత్రంతో విజయం సాధిస్తాడని ఆశిద్దాం.