గుడ్‌న్యూస్‌ : వ‌్యాక్సిన్ వ‌చ్చేసింది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Aug 2020 3:17 PM IST
గుడ్‌న్యూస్‌ : వ‌్యాక్సిన్ వ‌చ్చేసింది

క‌రోనాపై పోరులో నేడు కీల‌క మ‌లుపు చోటుచేసుకుంది. ఎనిమిది నెల‌లుగా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారిపై పోరులో ర‌ష్యా పైచేయి సాధించింది. కరోనా వ్యాక్సిన్‍ను రిజిస్టర్ చేసిన తొలి దేశంగా రష్యా చ‌రిత్ర సృష్టించింది. రష్యా నుంచి కరోనాపై తొలి వ్యాక్సిన్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్ర‌క‌టించారు.

ఈ వ్యాక్సిన్‌ కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా నిరోధించే వ్యాధి నిరోధకతను కలిగిఉందని వ్యాక్సిన్‌ను ప్రారంభిస్తూ ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే తొలి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను మంగళవారం ఉదయం రష్యా నమోదు చేసిందని మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పుతిన్‌ వెల్లడించారు.

వ్యాక్సిన్‌ పనితీరుపై తనకు సమాచారం అందించాలని ఆరోగ్య మంత్రి మైఖేల్‌ మురష్కోను ఆయన కోరారు. అయితే.. పుతిన్‌ కుమార్తె సహా పలువురికి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇదిలావుంటే.. ప‌న్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్పటివరకూ 2 కోట్లకు పైగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు న‌మోద‌వ‌గా.. 7.35 లక్షల మంది మహమ్మారి బారినపడి మరణించారు. కాగ, ప‌లు దేశాల్లో వైర‌స్‌కు సంబంధించి వ్యాక్సిన్ క్లీనిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయి.

Next Story