భారత్‌లో 24గంటల్లో 53,601 పాజిటివ్‌ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Aug 2020 5:37 AM GMT
భారత్‌లో 24గంటల్లో 53,601 పాజిటివ్‌ కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 50వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 53,601 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 871 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 22,68,676కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 15,83,490 మంది కోలుకుని నుంచి డిశ్చార్జి కగా.. 6,39, 929 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 45,257 మంది మృత్యువాత పడ్డారు.

ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 70శాతం ఉండగా.. మరణాల రేటు 1.99శాతంగా ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజే 4,77,023 శాంపిళ్లను పరీక్షించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 2,45,83,558 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. బ్రెజిల్‌, భారత్‌ ఆ తరువాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. అత్యధిక మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ ఐదో స్థానంలో కొనసాగుతోంది.

Next Story
Share it