ల‌గ్జ‌రీ కార్ల‌ దిగ్గజం 'బీఎండబ్ల్యూ' ఇండియా అధ్యక్షుడు అక‌స్మిక మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 April 2020 1:58 PM GMT
ల‌గ్జ‌రీ కార్ల‌ దిగ్గజం బీఎండబ్ల్యూ ఇండియా అధ్యక్షుడు అక‌స్మిక మృతి

జర్మనీకి చెందిన ల‌గ్జ‌రీ కార్ల‌ దిగ్గజం బీఎండబ్ల్యూ ఇండియా అధ్యక్షుడు, సీఈవో రుద్ర తేజ్ సింగ్ (46) నేడు క‌న్నుమూశారు. ఈ రోజు ఉద‌యం ఆయ‌న‌కు తీవ్రమైన గుండెపోటుతో రావడంతో అక‌స్మికంగా త‌నువు చాలించారు. ఈ ఘ‌ట‌న‌తో బీఎండబ్ల్యూ ఇండియా యాజమాన్యం, సిబ్బంది తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రుద్ర తేజ్ సింగ్ మ‌ర‌ణం ప‌ట్ల‌ బీఎండబ్ల్యూ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

భార‌త్‌లో బీఎండబ్ల్యూ బ‌ల‌మైన‌ నెట్‌వర్క్‌ను ఏర్ప‌రుస్తున్న క్ర‌మంలో రుద్ర తేజ్ సింగ్ మరణం తమ సంస్థకు తీర‌ని లోట‌ని పేర్కొంది. ఆయ‌న‌ కుటుంబ స‌భ్యుల‌కు తీవ్ర సంతాపాన్ని తెలియ‌జేసింది. మంచి మ‌న‌సున్న‌, గొప్ప స్ఫూర్తివంత‌మైన నాయకుడిగా రుద్ర తేజ్ సింగ్ నిలిచిపోతారని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా పేర్కొంది.

యూపీకి చెందిన రుద్ర తేజ్ సింగ్.. ‌1996లో సేల్స్ మేనేజర్‌గా జీవితం ప్రారంభించారు. వృత్తిలో ప‌ట్ల అంకితభావంతో ప‌నిచేస్తూ.. క్ర‌మ‌క్ర‌మంగా క్రమంగా ఎదిగారు. బీఎండబ్ల్యూ కంటే ముందు రుద్ర రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో ప‌నిచేశారు. అక్క‌డ అనేక ఉన్న‌త ప‌ద‌వుల‌ను చేప‌ట్టి.. 2019 ఆగస్టు 1 ఆగస్టులో బీఎండబ్ల్యూ అధ్యక్ష బాధ్యతలతో పాటు సీఈవోగా నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టారు. చిన్న వ‌య‌స్సులోనే ఎన్నో విజ‌యాల‌ను అందుకున్న రుద్ర తేజ్ సింగ్ జీవితం యువ‌త‌కు ఆద‌ర్శం అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.

Next Story