ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Oct 2019 2:57 PM ISTహైదరాబాద్: తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ.. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 19వ రోజుకు చేరింది.సమ్మెలో భాగంగా ఇద్దరు కార్మికులు ఆత్యహత్య చేసుకున్నారు. ఓ కార్మికుడు గుండె పోటుతో మృతి చెందాడు. ఇది జరిగిన కొద్ది రోజుల తేడాలోనే ఇవాళ మరో కార్మికుడి గుండె ఆగింది. ముషిరాబాద్ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్ అనే కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామానికి చెందిన రమేష్ గత 17 రోజులుగా సమ్మెలో చురుగ్గా పాల్గొన్నాడు. రెండు రోజుల గుండెనొప్పి రావడంతో మలక్‌పేటలోని యశోదా ఆస్పత్రిలో ఆడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. ప్రభుత్వం చర్చలు జరపకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. నేడు అన్ని డిపోల వద్ద కార్మికులు ఆందోళన నిర్వహించారు. తమ సమ్మెకు మద్దతు తెలపాలని కార్మిక సంఘాల నేతలు ప్రజాప్రతినిధులను కోరనున్నారు.