బొలెరో వాహనం బోల్తా.. ఆర్‌ఎస్ఐ మృతి
By తోట వంశీ కుమార్ Published on 3 May 2020 12:05 PM IST
యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలోని కందిగడ్డ తండా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్ఎస్సై మృతి చెందాడు. వరంగల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్(పీటీసీ)లో పనిచేస్తున్న రిజర్వుడ్ సబ్ ఇన్‌స్పెక్టర్ వాంకుడోత్ కర్ణుడు(36) బొలేరో వాహానంలో వరంగల్ నుంచి హైదరాబాద్ బయలు దేరాడు. పెంబర్తి గ్రామ శివారులోని రాగానే.. వాహానం వెనుక టైర్ పంక్చర్ అయి పేలిపోయింది. దీంతో వాహానం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కర్ణుడుకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 108 వాహానంలో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Next Story