రాష్ట్రాలకు మరో రూ.3000 కోట్లు
By రాణి Published on 6 April 2020 5:26 PM IST
జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి రాష్ట్రాలకు మరో రూ.3000 కోట్ల నిధులివ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్య సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఇప్పటికే రూ.1100 కోట్లు విడుదల చేశామని, ఇంకా కరోనా కేసులు పెరుగుతుండటంతో అదనంగా రూ.3000 కోట్లు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా..గడిచిన 24 గంటల్లో దేశంలో 693 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 334, ఏపీలో 226 మంది కరోనా బాధితులు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స తీసుకుంటున్నారు.
Also Read : అద్దెకారులో ఒకరి తర్వాత ఒకరు..దుస్తులు లేకుండానే..
ఇక దేశ వ్యాప్తంగా 4067 కరోనా కేసులు నమోదవ్వగా..109 మంది వైరస్ కారణంగా మరణించినట్లు లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. మరణించిన వారిలో 63 శాతం 60 ఏళ్లకు పైబడి, 30 శాతం 40-60 ఏళ్ల లోపు వారు, 7 శాతం 40 ఏళ్ల లోపు వారున్నట్లు తెలిపారు. దేశంలో నమోదైన 4067 పాజిటివ్ కేసుల్లో 1445 కేసులు ఢిల్లీ లింక్ కేసులేనన్నారు. మొత్తం బాధితుల్లో 76 శాతం పురుషులు కాగా..24 శాతం మంది మహిళలున్నారని తెలిపారు.
Also Read :సుమ ఇంట విషాదం.. రాజీవ్ కనకాల సోదరి మృతి