సీనియర్‌ నటుడు, దర్శకుడు దేవదాస్‌ కనకాల – లక్ష్మీదేవి కనకాలల కుమార్తె , సీనియర్‌ నటుడు రాజీవ్‌ కనకాల సోదరి శ్రీలక్ష్మీ సోమవారం అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలో క్యాన్సర్‌ రావడంతో ఆమె మనోస్థైర్యంతో పోరాడి దాని నుండి బయట పడ్డారు. అయితే ఆమె అనుకోకుండా మరణించడంతో కనకాల వారింట విషాద ఛాయలు అలముకున్నాయి. దేవదాస్‌ కనకాలకు ఏకైక కుమార్తె శ్రీలక్ష్మీ. ఆమె కూడా అనేక టీవీ సీరియల్స్‌లో నటించారు. శ్రీలక్ష్మీ భర్త సీనియర్‌ జర్నలిస్టు పెద్ది రామారావు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.

Also Read :లాక్‌డౌన్‌ పొడగింపా? ఆంక్షలా?.. 9 తరువాత స్పష్టత వచ్చే అవకాశం..

గతేడాది రాజీవ్‌ కనకాల తండ్రి దేవదాస్‌ కనకాల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాజీవ్‌ కనకాల సోదరి మృతిచెందడంతో వారింట విషాదం అలముకుంది. ఇదిలా ఉంటే రాజీవ్‌ కనకాల భార్య, ప్రముఖ యాంకర్‌ సుమకు శ్రీలక్ష్మీకి మధ్య మంచి స్నేహం ఉంది. రాజీవ్‌తో సుమ పెళ్లి కాకముందు నుంచే వీరిద్దరు మంచి స్నేహితులు. ఇదిలాఉంటే శ్రీలక్ష్మీ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, టీవీ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్