హైదరాబాద్‌: రౌడీషీటర్‌ దారుణ హత్య.. కత్తులతో పొడిచి పొడిచి..

By సుభాష్  Published on  11 May 2020 3:37 PM IST
హైదరాబాద్‌: రౌడీషీటర్‌ దారుణ హత్య.. కత్తులతో పొడిచి పొడిచి..

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట ఆర్‌పీ కాలనీలో 30 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పది మంది దుండగులు యువకున్ని తరుముకుంటూ కత్తులతో దాడి చేసి చంపేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే హత్యకు గురైంది రౌడీ షీటర్‌ ఫయాజ్‌ అని గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సదరు వ్యక్తి హత్యకు గురికావడానికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

అయితే కాలనీ వాసులే చంపేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. హత్య చేసింది ప్రశాంత్‌, టిల్లు, చంపక్‌లపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ప్రాంతంలో సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story