మహిళపై లైంగిక దాడికి పాల్పడిన 70 వృద్ధున్ని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. భర్తను వదిలేసి ఒంటరిగా ఉంటున్న 23 ఏళ్ల మహిళకు ఆశ్రయం కల్పిస్తానని చెప్పిన ఓ వ్యక్తి ద్వారా బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలో నివసించే మహమ్మద్‌ సలీమ్‌ ఇంటికి వచ్చింది. తన ఇంట్లో ఉంచుకుంటానని చెప్పిన ఆ వృద్దుడు .. జ్యూస్‌లో మత్తు కలిపి తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడని సదరు మహిళ పోలీసులకు తెలిపింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని వృద్ధుడు సలీమ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కాగా, సలీమ్‌కు నలుగురు భార్యలు. వారు విదేశాల్లో ఉంటున్నారు. ఈయన కూడా విదేశాల్లోనే ఉంటూ అమ్మాయిల కోసం హైదరాబాద్‌కు వస్తుంటాడని తెలుస్తోంది. ఆర్థిక సాయం చేస్తానని చెప్పి అమ్మాయిలపై అత్యాచారం చేయడమే ఇతని పని.

కాగా, కరోనా మహమ్మారి వల్ల దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో క్రైమ్‌ రేటు కూడా పూర్తిగా పడిపోయింది. ఎక్కడ కూడా ఎలాంటి నేరాలు జరగడం లేదు. రోడ్డు ప్రమాదాలు, చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు పూర్తిగా తగ్గిపోయాయి. కానీ ఇలాంటి కామాంధుల వల్ల సమాజానికే చెడ్డ పేరు వస్తోంది. 70 ఏళ్ల వచ్చినప్పటికి కామ కోరికలే కొంప ముంచుతున్నాయి. ఇంత వయసు వచ్చినా కూడా కామ కోరికలు ఇలా ఉంటే.. యుక్త వయసులో కూడా ఎన్ని కథలు పడ్డాడో ఇట్టే అర్థమైపోతోంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *