బిగ్ బ్రేకింగ్: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై రౌడీ షీట్ ..!
By అంజి Published on 18 Dec 2019 4:47 PM ISTహైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై రౌడీ షీట్ కేసు నమోదు అయ్యింది. మంగల్‌హాట్ పోలీస్‌స్టేషన్‌లో రౌడీ షీట్ లిస్ట్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్ పేరును పోలీసులు ఉంచారు. మంగళ్‌హాట్ పోలీసులు ఇవాళ రౌడీ షీట్‌ల కొత్త లిస్టును విడుదల చేశారు. తనపై రౌడీషీట్ నమోదు కావడంతో గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ పోలీసుల నిజస్వరూపమని రాజసింగ్ పేర్కొన్నారు. ప్రజా సేవ చేస్తున్న తనపై రౌడ్‌షీట్ కేసు నమోదు చేయడాన్ని రాజాసింగ్ తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. చాలా మంది రౌడీలేనని, వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని పోలీసులను ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు.
Next Story