ఎమ్మెల్యే రోజా క్లాసికల్‌ డ్యాన్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా..

By సుభాష్
Published on : 8 March 2020 6:47 PM IST

ఎమ్మెల్యే రోజా క్లాసికల్‌ డ్యాన్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా..

నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా క్లాసికల్‌ నృత్య ప్రదర్శనతో ఎంతో ఆకట్టుకున్నారు. లైఫ్‌ ఎన్‌ లా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. 'నవ జనార్దన పారిజాత' నృత్య ప్రదర్శనతో వీక్షకులను ఆకట్టుకున్నారు. సుప్రసిద్ద నాట్య గురువు కళాకృష్ణ పర్యవేక్షణలో రోజా, సీఎస్‌ సుభారాజేశ్వరి నవ జనార్దన పారిజాతం నృత్యప్రదర్శన ఇచ్కచారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ గవర్నర్‌ తమిళి సై విచ్చేశారు.

గవర్నర్‌తో పాటు ఏపీ తెలుగు అకాడమీ చైర్‌ పర్సన్‌ లక్ష్మీ పార్వతి, ప్రముఖ దర్శకుడు ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్‌ శివకుమార్‌, ఫౌండేషన్‌ జనరల్‌ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నాట్య ప్రదర్శనతో అందరిని అలరించిన రోజాను గవర్నర్‌ అభినందించి జ్ఞాపికను బహుకరించారు.

Next Story