దేవుడా.. రోహిత మరో దిశ కాకూడదు..!

By అంజి  Published on  11 Jan 2020 1:01 PM GMT
దేవుడా.. రోహిత మరో దిశ కాకూడదు..!

దిశ కేసు దేశాన్నే కుదిపేసింది. కానీ మన దర్యాప్తు దళాలకు, పోలీసు బలగాలకు ఇంకా మెలకువ రాలేదు. దిశ సంఘటన జరిగి రెండు నెలలు కూడా కాలేదు. ఇప్పటికీ అదే నిర్లక్ష్యం, అదే సమన్వయ రాహిత్యం కొట్టొచ్చినట్టు కానవస్తోంది. అందుకు తాజా ఉదాహరణ సాఫ్ట్ వేర్ ఉద్యోగి రోహితా అదృశ్య సంఘటన.

రోహిత డిసెంబర్ 26 నాటి నుంచి అదృశ్యమైపోయింది. అయితే పోలీసు దర్యాప్తులో రోహిత జనవరి 6 న సికింద్రాబాద్ రేల్వే స్టేషన్ దగ్గర 8 నంబర్ బస్సు ఎక్కినట్టు తేలింది. ఆ తరువాత నుంచి ఆమె అచుకీ కనపడడం లేదు. వివిధ నిఘా విభాగాల మధ్య సమన్వయం లేకపోవడంతో ఎవరికి వారు ఇతరులపై నెట్టేసి తప్పించుకుంటున్నారని రోహిత సోదరుడు పరీక్షిత్ కాటూర్ అంటున్నారు. ఆమె తన బస్సులో ఎక్కి చంద్రాయణగుట్ట దగ్గర దిగినట్టు ధర్మేంద్ర అనే కండక్టర్ చెప్పాడని పరీక్షిత్ అంటున్నారు. పరీక్షిత్ చంద్రాయణగుట్ట ప్రాంతంలో ఆమె ఫోటో చూపించి, స్థానికులను అడిగితే వారు ఒక పోలీసు అధికారి వద్దకు తీసుకువెళ్లారు. ఆ పోలీసు అధికారి రోహిత అదృశ్యం అయినట్టు తనకు తెలుసునని, తనకు పోలీసు విభాగం నుంచి ఆమె ఫోటో వచ్చిందని అంగీకరించాడు. కానీ ఆయన ఆమె ఫోటోను కనీసం డౌన్ లోడ్ కూడా చేసుకోలేదు.

ఆ తరువాత ఒక ఆటో డ్రైవర్ రోహిత ఇంకో ఆటోలో ఎక్కడం తాను చూశానని, అయితే ఆ ఆటో నంబర్ కానీ, డ్రైవర్ ను కానీ తాను గుర్తించలేనని చెప్పాడు. ఇక ఆ ప్రాంతంలో సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించబోతే, ఎక్కువ భాగం సీసీటీవీలు రిపేర్లలో ఉన్నాయి. కాబట్టి ఎలాంటి ఫుటేజీ లేదు. దీంతో పరీక్షిత్ హతాశుడయ్యాడు. “ నా చెల్లి కి కూడా దిశకు పట్టిన గతే పట్టకూడదని వేయి దేవుళ్లను వేడుకుంటున్నాను” అన్నాడు పరీక్షిత్.

Next Story
Share it