రోహిత్‌ మొదలెట్టేశాడు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jun 2020 11:58 AM IST
రోహిత్‌ మొదలెట్టేశాడు..

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ వల్ల భారత్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ ఇంటికే పరిమితం అయ్యాడు. లాక్‌డౌన్‌ కాలంలో సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉన్న ఈ భారత ఓపెనర్‌ పలువురు ఆటగాళ్లతో కలిసి సోషల్ మీడియాలో లైవ్‌ చాట్‌లో పాల్గొన్నాడు. క్రికెట్‌ కెరీర్‌లో తాను ఎదుర్కొన్న పలు సంఘటనలను అభిమానులతో పంచుకున్నాడు. మూడో డబుల్‌ సెంచరీ సాధించినప్పుడు తన సతీమణి ఎందుకు కన్నీరు పెట్టుకుందో అన్న విషయాన్ని చెప్పేశాడు. ఇక లాక్‌డౌన్‌ కాలంలో తాను సిక్సర్లను బాగా మిస్సవుతున్నానంటూ ఇటీవల సిక్సర్లు కొట్టిన వీడియోను పంచుకున్నాడు రోహిత్.

ఇన్ని రోజులు ఇంటికే పరిమితం అయిన రోహిత్‌ శర్మ చాలా రోజుల తరువాత మైదానంలో అడుగుపెట్టాడు. తన ఇంటికి దగ్గరలోని ఓ మైదానంలోకి వెళ్లి సాధన చేశాడు. ఈ విషయాన్ని రోహిత్‌ స్వయంగా చెప్పాడు. సుధీర్ఘ విరామం తర్వాత మళ్లీ మైదానానికి రావడం చాలా సంతోషంగా ఉంది అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు హిట్‌మ్యాన్‌.

ఈ ఏడాది ప్రారంభంలో టీమ్‌ఇండియా కివీస్‌ పర్యటనకు వెళ్లింది. అయితే.. ఈపర్యటనలో మధ్యలో చీలమండల గాయంతో రోహిత్‌ స్వదేశానికి చేరుకున్నాడు. ఆతరువాత ఫిట్‌నెస్‌ సాధించిన రోహిత్ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)లో పాల్గొనాలని అనుకున్నాడు. అయితే.. కరోనా కారణంగా మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Next Story