హైదరాబాద్ : అబిడ్స్ గన్ ఫౌండ్రి లోని దుర్గా భవానీ ఆలయంలో చోరీ జరిగింది. నిన్న సాయంత్రం ఓ గుర్తు తెలియని వ్యక్తి భక్తుడిగా వచ్చాడు. దుర్గా భవానీ పై ఉన్న అర్ధ కిలో వెండి కిరీటాన్ని వెత్తుకెళ్లాడు. ఆలయ పూజారి గమనించి ఆలయ నిర్వాహకుల దృష్టికి దొంగతనం విషయాన్ని తీసుకెళ్లాడు. ఆలయ కమిటీ సభ్యులు అబిడ్స్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీపీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దొంగ కోసం పోలీసులు వెతుకుతున్నారు.



